Breaking News

Sri Reddy: ఆ కంపు నోరుతో మాట్లాడకు నాయనా.. నీ చరిత్ర తెలియదా? బండ్ల గణేష్‌, నాగబాబు పరువు గోవిందా!


బాబు బండ్ల గణేష్.. అంటూ అతనిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడింది సంచలన తార . క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేపట్టి ఇండస్ట్రీ బడా బాబుల రహస్యాలు బయటపెట్టిన శ్రీ రెడ్డి.. గత కొంతకాలంగా చెన్నై వేదికగా సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ అవుతోంది. సినీ, రాజకీయ వర్గాల్లో నిత్యం జరుగుతున్న పరిణామాలపై ఓ కన్నేస్తూ తనదైన కోణంలో రియాక్ట్ అవుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ ఇటు బండ్ల గణేష్, అటు నాగబాబులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాలపై ప్రకాష్ రాజ్ తన స్పందన తెలపగా.. దానికి కౌంటర్‌గా మెగా బ్రదర్ , సినీ నటుడు బండ్ల గణేష్ కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ ఇష్యూ జనాల్లో చర్చనీయాంశం అయింది. ఇంతలో శ్రీ రెడ్డి ఎంటరై , నాగబాబుల పరువు తీసే మాటలతో రెచ్చిపోయింది. బాబు బండ్ల గణేష్.. నీకెందుకయ్యా రాజకీయాలు. రాజకీయ సన్యాసం అని కాసేపు అంటావ్. అన్నీ అబద్దాలు చెబుతుంటావు. మరోసారి రాజకీయాలపై మాట్లాడుతుంటావు. నోరు తెరిచి ఏదేదో వాగుతూ వివాదాల్లో దూరుతుంటావ్. నీకు నిజంగా రాజకీయ పరిజ్ఞానమే ఉంటే ఈ పాటికి గొప్ప రాజకీయవేత్త అయ్యేవాడివి. నిర్మాత సచిన్ జోషితో గొడవలు, ఆయనతో జరిపిన మంతనాలు? నీ చరిత్ర మాకు తెలియదా.. ప్రకాశ్ రాజ్‌ను విమర్శించేంత గొప్పవాడివా నువ్వు? అంటూ రెచ్చిపోయింది శ్రీ రెడ్డి. Also Read: పోనీ నువ్వేమన్నా ప్రకాశ్ రాజ్ అంత గొప్ప యాక్టర్‌వా? నీవే గనక మంచి యాక్టర్‌వి అయితే ఇప్పటికే గొప్ప కమెడియన్ అయి ఉండేవాడివి. కనీసం రాజకీయాలపై అవగాహన ఉంటే అలాగైనా ఎదిగే వాడివి. ఎందుకయ్యా ఆ కంపు నోరు వేసుకొని వాగుతుంటావ్. ఇక నాగబాబు.. మీరు యాక్టర్ గానీ, ప్రొడ్యూసర్‌గా గానీ, కమెడియన్‌గా గానీ, జడ్జ్‌గా గానీ ప్రూవ్ చేసుకోలేకపోయారు. జనాలేమీ ఎర్రివాళ్ళు కాదిక్కడ మీ మాటలు వినడానికి. ప్రకాష్ రాజ్ మీద గానీ, జగన్ గారి మీద గానీ కామెంట్స్ చేసే హక్కు లేదు మీకు అంటూ ఫైర్ అయింది శ్రీ రెడ్డి. సో.. చూడాలి మరి ఆమె చేసిన ఈ కామెంట్స్‌పై బండ్ల గణేష్‌, నాగబాబు స్పందిస్తారా? లేదా? అనేది.


By December 06, 2020 at 11:29AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sri-reddy-shocking-comments-on-bandla-ganesh-and-naga-babu/articleshow/79589674.cms

No comments