Nani: థియేటర్లలోకి ‘వి’.. సన్నాహాలు చేస్తున్న దిల్ రాజు
నేచురల్ స్టార్ 25వ చిత్రంగా తెరకెక్కిన ‘వి’ అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో సుధీర్‌బాబు పవర్‌ఫుల్ రోల్‌లో కనిపించారు. నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్స్‌గా నటించారు. మోహనకృష్ణ ఇంద్రగంటి డైరెక్షన్లో ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా అంతగా మెప్పించలేకపోయింది. మార్చిలోనే షూటింగ్ మొత్తం పూర్తయిపోవడంతో ఉగాది కానుకగా మార్చి 25న సినిమా విడుదల చేయాలనుకున్నారు. Also Read: అయితే కరోనా కారణంగా లాక్‌డౌన్ అమల్లోకి రావడంతో విడుదల ఆగిపోయింది. దీంతో నిర్మాత దిల్ రాజుకు అమెజాన్ ప్రైమ్ బంపరాఫర్ ఇవ్వడంతో ఓటీటీలో రిలీజ్ చేశారు. అయితే థియేటర్ల ఓపెన్ అయ్యాక అందులో రిలీజ్ చేసుకునేలా కండిషన్ పెట్టాకే దిల్ రాజ్ డిజిటల్ హక్కులు అమ్మినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. Also Read:
By December 10, 2020 at 09:54AM
No comments