భర్త కళ్లెదుటే ఘోరం.. భార్యపై 17 మంది.. దారుణం


మహిళల రక్షణకు కఠిన చట్టాలు చేసినా.. న్యాయస్థానాలు ఉరిశిక్షలు విధిస్తున్నా కామకీచకుల్లో కనీస భయం కలగడం లేదు. దేశంలో నిత్యం అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఉన్నావ్, దిశ, హత్రాస్ ఘటనలు మరువక ముందే దేశం దిగ్భ్రాంతికి గురయ్యే మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. కట్టుకున్న భర్త కళ్లెదుటే భార్యపై 17 మంది సామూహిక అత్యాచారం చేసిన అత్యంత దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ అమానవీయ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. దుమ్కా జిల్లాకి చెందిన మహిళ(35) తన భర్తతో కలసి వారాంతపు సంతకు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో దుండగులు వారిని అడ్డగించారు. భర్తను నిర్బంధించి అతని ఎదుటే భార్యపై అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. అభాగ్యురాలిపై 17 మంది అత్యాచారం చేశారు. ముఫసిల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘోరం జరిగింది. బాధితురాలికి ఐదుగురు పిల్లలున్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకరిని బాధితురాలు గుర్తుపట్టడంతో అతన్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నామని.. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు డీఐజీ సుదర్శన్ మండల్, దుమ్కా ఎస్పీ అంబర్ లక్రా తెలిపారు. Also Read:
By December 10, 2020 at 10:15AM
No comments