Krack: వచ్చే ఏడాది ఆరంభంలోనే మాస్ మహారాజ్ హంగామా.. క్రాక్ రిలీజ్ డేట్ ఫిక్స్
హీరో 2021 ఆరంభంలోనే మాస్ కిక్కిచ్చేందుకు రెడీ అయ్యాడు. ఆయన లేటెస్ట్ మూవీ 'క్రాక్' సంక్రాంతి కానుకగా విడుదల కాబోతోంది. వచ్చే ఏడాది జనవరి 14వ తేదీన థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించింది చిత్రయూనిట్. దీంతో చాలారోజుల తర్వాత వెండితెరపై మాస్ మహారాజ్ హంగామా చూడాలని కుతూహల పడుతున్నారు ఆయన ఫ్యాన్స్. రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను సరస్వతి ఫిలిమ్స్ డివిజన్ బ్యానర్‌పై ఠాగూర్ మధు నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన యథార్థ ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా రూపొందించారని టాక్. ఈ చిత్రంలో రవితేజ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించగా.. సముద్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ కనిపించనుండటం ఆసక్తికర అంశం. Also Read: నిజానికి ఎప్పుడో షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమాకు పలు ఓటీటీ సంస్థలు భారీ ఆఫర్ ఇచ్చినా.. క్రాక్ టీమ్ థియేటర్లలో విడుదల చేసేందుకే మొగ్గు చూపింది. మెల్లమెల్లగా ఇప్పుడిప్పుడే థియేటర్స్ ఓపెన్ అవుతుండటంతో మొదటి రేస్ లోనే రవితేజ రంగంలోకి దిగుతుండటం విశేషం. గతంలో రవితేజ- గోపీచంద్ మలినేని కాంబోలో వచ్చిన ''డాన్ శీను, బలుపు'' చిత్రాలు తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడంతో ఈ మూవీపై రవితేజ ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. దానికి తోడు ఇప్పటికే రిలీజైన టీజర్, ట్రైలర్, ఇతర అప్‌డేట్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి.
By December 20, 2020 at 12:32PM
No comments