Hyderabad: గాంధీ వైద్య విద్యార్థిని ఆత్మహత్య
హైదరాబాద్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వైద్య విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. గాంధీ మెడికల్ కాలేజీ, ఆస్పత్రిలో వైద్య విద్యనభ్యసిస్తున్న ఝాన్సీ ఈ రోజు ఆత్మహత్య చేసుకుంది. మల్కాజ్‌గిరిలోని ప్రశాంత్ నగర్‌లో నివాసముంటున్న ఝాన్సీ గాంధీలో పీజీ చదువుతోంది. అనూహ్యంగా హాస్టల్‌లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మెడికో ఆత్మహత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఆమెకు కొద్దిరోజులుగా పెళ్లి సంబంధాలు చూస్తున్నట్లు తెలుస్తోంది. సంబంధాలు కుదరడం లేదని ఆమె మనస్థాపానికి గురైనట్లు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. Also Read:
By December 05, 2020 at 11:07AM
No comments