ఆ పిరికిపంద దాడిని భారత్ ఎప్పటీకి మరచిపోదు.. ప్రధాని మోదీ
డిసెంబరు 13, 2001లో పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగి నేటికి 19 ఏళ్లు పూర్తయ్యింది. నాటి ఉగ్రదాడిని గుర్తుచేసుకున్నారు. పార్లమెంటుపై ఉగ్రవాదులు జరిపిన దాడిని ఎవరూ మరిచిపోరని వ్యాఖ్యానించారు. వీరోచితంగా పోరాడి ముష్కర దాడిని అడ్డుకుని, అమరులైన సైనికులకు ప్రధాని ఈ సందర్భంగా నివాళులర్పించారు. ‘2001లో ఇదే రోజు పార్లమెంటుపై పిరికిపందలు జరిపిన దాడిని ఎప్పటికీ మరువలేం. మన పార్లమెంటును కాపాడే క్రమంలో ప్రాణత్యాగం చేసినవారి శౌర్యపరాక్రమాలను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ దేశం వారికెప్పుడూ కృతజ్ఞతాపూర్వకంగా ఉంటుంది’ అంటూ మోదీ ట్విటర్ వేదికగా వారికి నివాళులర్పించారు. పాకిస్థాన్‌కు ఉగ్రవాద సంస్థలు లష్కరే తోయిబా, జైషే మహ్మద్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు పార్లమెంట్‌పై దాడికి తెగబడ్డారు. అప్పటికీ పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతుండగా...దాడి జరగడానికి కొద్ది నిమిషాల ముందు ఉభయ సభలు వాయిదా పడ్డాయి. అయినా, పలువురు ఎంపీలు, సిబ్బంది పార్లమెంట్ భవనంలోనే ఉన్నారు. ఒక్కసారిగా కారులో దూసుకొచ్చిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ముష్కరుల దాడిలో ఎనిమిది మంది భద్రతా సిబ్బంది సహా తొమ్మింది మంది ప్రాణాలు కోల్పోయారు. పార్లమెంటులోకి ప్రవేశించకుండా నిలువరించే క్రమంలో ఢిల్లీ పోలీసు విభాగానికి చెందిన ఐదుగురు పోలీసులు, ఒక సీఆర్‌పీఎఫ్ మహిళా కానిస్టేబుల్, ఇద్దరు పార్లమెంట్ వాచ్ అండ్ వార్డ్ సెక్షన్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో ఓ తోటమాలి, ఫొటో జర్నలిస్టు కూడా మృతిచెందారు. ఈ దాడిలో పాల్గొన్న ఐదుగురు ఉగ్రవాదులను భద్రతా దళాలు హతమార్చాయి. ఈ ఘటనతో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. పార్లమెంట్ వద్ద భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
By December 13, 2020 at 11:19AM
No comments