Breaking News

ఓ ఇంటివాడైన టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్.. పెళ్లి వేడుకలో హీరోహీరోయిన్స్ సందడి


సినిమాల సంగతి అటుంచితే ఈ ఏడాది టాలీవుడ్‌లో వరుసగా పెళ్లి బాజాలు మోగుతున్నాయి. కరోనా వెంటాడిన ఈ సంవత్సరం తాలూకు చేదు జ్ఞాపకాలను పెళ్లి సంబరాలతో చెరిపేస్తున్న సెలబ్రిటీలు. దిల్ రాజు రెండో పెళ్లి మొదలుకొని మొన్న మెగా వారింట జరిగిన నిహారిక వివాహ మహోత్సవం వరకు అందరి పెళ్లిళ్లు ఈ ఏడాది కనువిందు చేశాయి. నిఖిల్, నితిన్, రానా, కాజల్.. ఇలా వరుసపెట్టి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అంతా పెళ్లిపీటలెక్కేశారు. తాజాగా ఈ బాటలోనే టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా పెళ్లి తంతు ఫినిష్ చేసేశారు. కరోనా నిబంధనలకు లోబడి అతి కొద్దిమంది సన్నిహితుల సమక్షంలో శ్రీజ గౌని అమ్మాయి మెడలో మూడుముళ్ళేశారు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. పెద్దల ఆశీర్వదంతో నిరాడంబరంగా జరిగిన ఈ వేడుకలో సినీ పరిశ్రమ నుంచి హీరోయిన్ నివేదా థామస్, హీరో శ్రీ విష్ణు, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్ సహా పలువురు హాజరై సందడి చేశారు. నూతన వధూవరులతో హీరోహీరోయిన్స్ దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Also Read: ''మెంట‌ల్ మ‌దిలో, బ్రోచెవారెవ‌రురా'' చిత్రాలతో దర్శకుడిగా తన టాలెంట్ రుజువు చేసుకున్న వివేక్ ఆత్రేయ.. ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని హీరోగా 'అంటే.. సుందరానికీ!' అనే మూవీ రూపొందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై న‌వీన్ ఎర్నేని, ర‌విశంక‌ర్ య‌ల‌మంచిలి నిర్మిస్తున్న ఈ సినిమాలో మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా ఫహాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇటీవలే అఫీషియల్‌గా ప్రకటించి విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ లుక్ ప్రేక్షకలోకాన్ని విశేషంగా ఆకట్టుకుంది.


By December 20, 2020 at 10:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/talented-director-vivek-athreya-got-married/articleshow/79821766.cms

No comments