ఫ్రెండ్‌తో మందుపార్టీ.. అతని భార్యతో నోరుజారిన యువకుడు.. చివరికి..
ఫ్రెండ్ ఇంటికెళ్తున్నానని చెప్పిన యువకుడు మూడు రోజులైనా తిరిగిరాలేదు. కంగారుపడిన అతని తల్లి పోలీసులను ఆశ్రయించింది. తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇంతలో ముక్కలుముక్కలుగా నరికిన యువకుడి శవం మురుగుకాల్వలో లభ్యమైంది. కనిపించకుండా పోయిన వ్యక్తి శవమై తేలాడు. రంగంలోకి దిగిన ఖాకీలు బరువైన బ్యాగ్ మోసుకెళ్తున్న వ్యక్తిని సీసీటీవీలో గమనించి ఆరా తీయడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. స్నేహితుడే చంపేసి మురుగుకాల్వలో పడేసినట్లు తేలింది. ఈ దారుణ ఘటన ముంబైలో జరిగింది. నగరంలోని వోర్లీ ఏరియాలో నివాసముంటున్న బ్యాంకు ఉద్యోగి సుశీల్ కుమార్ ఫ్రెండ్‌ని కలిసేందుకు గత శనివారం విరార్ వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుంచి బయటికెళ్లాడు. మూడు రోజులైనా తిరిగిరాకపోవడంతో ఆమె తల్లి పోలీసులను ఆశ్రయించింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నేరల్ రైల్వేస్టేషన్ పరిధిలో మురుగుకాల్వలో ముక్కలుముక్కలుగా నరికిన యువకుడి శవం బయటపడింది. కనిపించకుండా పోయిన సుశీల్ కుమార్ మృతదేహంగా గుర్తించారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులకి సీసీటీవీ ఫుటేజీ క్లూ ఇచ్చింది. బరువైన బ్యాగ్‌తో వచ్చిన వ్యక్తిని రౌండప్ చేసి అతని కోసం గాలించారు. బ్యాగ్ తీసుకొచ్చిన చార్లెస్ నాడార్‌ని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో విచారించడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. విరార్ వెళ్తున్నానని చెప్పిన సుశీల్ కుమార్ నేరల్‌లోని నాడార్ ఇంటికొచ్చాడు. ఇద్దరూ మధ్యాహ్నం నుంచి రాత్రి వరకూ ఫుల్లుగా మందుపార్టీ చేసుకున్నారు. సుశీల్ మద్యం మత్తులో నాడార్ భార్యపై నోరుజారాడు. ఆమెను అసభ్యంగా నానాబూతులు తిట్టాడు. తన భార్యను తిట్టడంతో నాడార్ ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మద్యం మత్తులో ఉన్న సుశీల్‌ని నాడార్ దారుణంగా చంపేశాడు. అనంతరం అతని శవాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో ముక్కలుముక్కలుగా నరికాడు. వాటిని బ్యాగ్‌లో పెట్టుకుని నేరల్ సమీపంలోని మురుగుకాల్వలో పడేశాడు. అయితే సీసీటీవీ ఫుటేజీలతో అడ్డంగా దొరికిపోయాడు. బరువైన బ్యాగులు మోసుకొస్తున్న నాడార్‌ని చూసి పోలీసులకు అనుమానం రావడంతో అతని బండారం బయటపడింది. భార్యని తిట్టాడని ఫ్రెండ్‌ని చంపేసినట్లు నాడార్ ఒప్పుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. Also Read:
By December 20, 2020 at 11:06AM
No comments