ఓపెన్ చేయకుండా ఉండలేకపోతున్నా.. పుట్టిన రోజు సందర్భంగా తమన్నా ఆసక్తికర వ్యాఖ్యలు
తమన్నా.. ఈ పేరు వినగానే ఎవ్వరికైనా ముందుగా గుర్తొచ్చేది ఆమె నాజూకు నడుము, పాలరాతి చర్మ సౌందర్యం. అంతకన్నా మించి వెండితెరపై ఆమె చూపే అభినయం. అందానికి అభినయం తోడు కావడంతో టాలీవుడ్ హీరోయిన్లందరిలో తమన్నాకు సూపర్ డిమాండ్ నెలకొంది. ఆమె ఫిట్‌నెస్, డాన్స్‌కి ఫిదా అయిన ప్రేక్షకలోకం గత 15 ఏళ్లుగా ఆమెను అభిమానిస్తూ వస్తోంది. కాగా రేపు (డిసెంబర్ 21) ఆమె 31వ పుట్టిన రోజు సందర్భంగా తాజాగా మిల్కీబ్యూటీ చేసిన ఆసక్తికర ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. తన బర్త్‌డే సందర్భంగా స్నేహితులతో కలిసి ముందుగానే బర్త్ డే సెలబ్రేషన్స్ ఎంజాయ్ చేసిన వారితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంది. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టిన ఆమె.. ''బర్త్ డే గిఫ్ట్స్‌ను ఓపెన్ చేయకుండా నేను ఉండలేక పోతున్నాను'' అంటూ ఆసక్తికరంగా కామెంట్ చేసింది. అలాగే తన ఫ్రెండ్ ఇచ్చిన బర్త్ డే గిఫ్ట్ వింటర్ జాకెట్‌ను ధరించి తెగ మురిసిపోతూ కనిపించింది తమన్నా. Also Read: 15 ఏళ్ల వయసులోనే సినీ గడపతొక్కిన తమన్నా.. తెలుగు, తమిళ, హిందీ భాషలో పలు చిత్రాల్లో నటించి భారీ పాపులారిటీ కూడగట్టుకుంది. 2005 సంవత్సరంలో 'చాంద్ సా రోషన్ చెహ్రా' అనే హిందీ సినిమాలో నటించి అదే ఏడాది 'శ్రీ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయం అయింది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన 'హ్యాపీ డేస్' మూవీ ఆమె కెరీర్‌కి పునాది వేసింది. ఆ తర్వాత వెనుతిరిగి చూడని ఈ ముద్దుగుమ్మ అందరు అగ్ర హీరోల సరసన నటించింది.
By December 20, 2020 at 10:04AM
No comments