ఆస్పత్రి బెడ్‌పై బాలిక వీడియో కలకలం.. గుంటూరులో దారుణం
పోకిరీ వేధింపులు భరించలేక మైనర్ బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది. ఆస్పత్రి బెడ్‌పై నుంచి ఆమె తీసిన వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. వేధింపులు తట్టుకోలేక పురుగుల మందు తాగానని చెప్పి బాలిక చనిపోవడంతో సంచలనంగా మారింది. మేడికొండూరు మండలం కొర్రపాడుకి చెందిన బాలిక(16)ను అదే గ్రామానికి చెందిన వరప్రసాద్ ప్రేమపేరుతో వేధింపులకు గురిచేసేవాడు. ఆ విషయం కుటుంబ సభ్యులకు చెప్పలేక మదనపడిన బాలిక ఈ నెల 13న ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో అందరూ నిద్రిస్తున్న సమయంలో గడ్డిమందు తాగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను జీజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న బాలిక తన చావుకి తల్లిదండ్రులతో సంబంధం లేదని.. వరప్రసాద్ అనే యువకుడి వేధింపుల కారణంగానే ఆత్మహత్యాయత్నం చేసినట్లు చెప్పింది. అనంతరం ఆమె ప్రాణాలు విడిచింది. చివరి క్షణాల్లో హృదయ విదారకంగా ఉన్న ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర కలకలం రేగింది. తన చావుకి కారణమైన వరప్రసాద్‌ని కఠినంగా శిక్షించాలని ఆమె వీడియోలో కోరింది. ఈ ఘటనపై మేడికొండూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విషయం తెలుసుకున్న తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఆస్పత్రికి చేరుకుని బాలిక భౌతికకాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మహత్యకు కారణమై వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు సూచించారు. Also Read:
By December 20, 2020 at 10:02AM
No comments