Breaking News

హైదరాబాద్‌లో ‘వకీల్ సాబ్’.. పవన్, శ్రుతిహాసన్‌లతో కీలక షెడ్యూల్


పవర్‌ స్టార్ పవన్‌ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘’. లాక్‌డౌన్ ముగిశాక ఓ షెడ్యూల్‌లో పాల్గొన్న ఆయన కాస్త విరామం తీసుకున్నారు. తాజాగా కీలక సన్నివేశాల చిత్రీకరణ మళ్లీ సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఇందులో యాక్షన్ సన్నివేశాలతో పాటు ప్లాష్ బ్యాక్‌కు సంబంధించిన కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు సమాచారం. ఈ షూటింగులో పవన్‌తో పాటు హీరోయిన్ శ్రుతిహాసన్ కూడా పాల్గొంటోంది. ఇప్పటికే తుది దశకు చేరుకున్న ఈ సినిమా షూటింగ్ ఈ షెడ్యూల్‌తో పూర్తవుతుందని యూనిట్ చెబుతోంది. అనంతరం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన సమ్మర్‌కు విడుదల చేసేలా నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. హిందీ ‘పింక్’ సినిమాకు రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వేణు శ్రీరామ్ దర్శకుడు. నివేదా థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులు ‘వకీల్ సాబ్’ రాక కోసం ఎదురుచూస్తున్నారు.


By December 17, 2020 at 07:32AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/pawan-kalyan-starrer-vakeel-saab-movie-shooting-continues-in-hyderabad/articleshow/79770528.cms

No comments