అభాగ్యురాలి శవాన్ని పీక్కుతిన్నాయ్.. తీవ్రంగా కలిచివేసే ఘటన
దిక్కూమొక్కూలేని అభాగ్యురాలు భిక్షాటన చేస్తూ కాలం వెళ్లబుచ్చుతోంది. ఆరోగ్యం సహకరించక రోజూ పడుకునే బస్టాండ్ ఆవరణలోనే ప్రాణాలు కోల్పోయింది. చనిపోయాక కూడా ఆమెకు రక్షణ లేకుండా పోయింది. అనాథ శవంగా పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పందులు పీక్కుతినడం తీవ్రంగా కలచివేస్తోంది. ఈ అమానుష ఘటన జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ కొత్త బస్టాండ్ ఆవరణలో విషాద ఘటన వెలుగుచూసింది. పట్టణంలో భిక్షాటన చేసి రాత్రి పూట బస్టాండ్ ఆవరణలో తలదాచుకుంటున్న అభాగ్యురాలు నిద్రలోనే చనిపోయింది. చలనం లేకుండా పడి ఉన్న ఆమె మృతదేహాన్ని పందులు పీక్కుతిన్నాయి. మహిళ మృతదేహాన్ని వరాహాలు పీక్కుతినడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. పోలీసులకు సమాచారం అందించడంతో మున్సిపల్ సిబ్బంది సహకారంతో మృతదేహాన్ని అచ్చంపేట ఆస్పత్రికి తరలించారు. Also Read:
By December 13, 2020 at 11:46AM
No comments