వేధింపులతోనే చిత్ర ఆత్మహత్య.. భర్తను అరెస్ట్ చేసిన చెన్నై పోలీసులు
బుల్లితెర నటి ఆత్మహత్య కేసులో ఆమె భర్త హేమంత్ రవిని పోలీసులు అరెస్టు చేశారు. చిత్ర ఈ నెల 9వ తేదీన చెన్నైలోని నజరత్‌పేట్టైలో గత ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై తల్లిదండ్రుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్ర భర్తతో పాటు ఆమె సహనటులు, స్నేహితులను విచారిస్తున్నారు. తమ కూతురిని అల్లుడే కొట్టి చంపేశాడని చిత్ర తల్లి విజయ ఆరోపించడంతో పోలీసులు అతడిపైనే ఫోకస్ పెట్టారు. ఈ క్రమంలోనే సీరియల్‌లోని కొన్ని దృశ్యాల వల్ల భార్యాభర్తల మధ్య గొడవ జరిగిందని, అదే చిత్ర ఆత్మహత్యకు దారితీసినట్లు పోలీసులు నిర్ధారించారు.
‘చిత్ర నటించిన సీరియల్‌లోని కొన్ని సీన్లపై హేమంత్ అభ్యంతరం తెలిపాడు. ఆ రోజు రాత్రి షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత ఇద్దరి మధ్య గొడవ జరిగింది. హేమంత్ ఆవేశంలో చిత్రను నెట్టివేయడంతో ఆమె తీవ్ర ఆవేదనకు గురైంది’ అని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో చిత్ర ఆత్మహత్య చేసుకున్నట్లు తేలినప్పటికీ.. అందుకు ప్రేరేపించిన ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. By December 15, 2020 at 02:41PM
No comments