బావిలో బైక్, యువకుడి శవం.. గుంటూరులో దారుణం
గుంటూరులో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. మండలం జొన్నలగడ్డలో మూడు రోజుల కిందట అనుమానాస్పద స్థితిలో బావిలో బయటపడిన యువకుడి మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం పెట్టుకున్నాడన్న కోపంతో ప్రియురాలి భర్త దారుణంగా చంపేసి బావిలో పడేసినట్లు తేలింది. గొడ్డలితో నరికి చంపి.. ఆ తరువాత బావిలో పడేసి వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ దారుణ ఘటన వివరాలు.. గ్రామానికి చెందిన కొండమీద వెంకటగిరి ఇంజనీరింగ్ కళాశాల వెనక వైపు బావిలో శవమై తేలాడు. అప్పటికే చనిపోయి నాలుగైదు రోజులు గడిచిపోవడంతో బాగా ఉబ్బి దారుణ స్థితిలో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహంపై గాయాలు ఉండడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టడంతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెంకటగిరికి అదే గ్రామానికి చెందిన నాగరాజు భార్యతో వివాహేతర సంబంధం ఉంది. ఆ విషయం తెలుసుకున్న నాగరాజు కోపంతో రగిలిపోయాడు. ఎలాగైనా వెంకటగిరిని అంతంచేయాలని పథకం పన్నాడు. తన స్నేహితుడు వీరబ్రహ్మంతో కలసి ఈ నెల 5న మద్యం తాగుదామని నమ్మించి వెంకటగిరిని రప్పించాడు. గ్రామ సమీపంలోని సుబాబుల్ తోట వద్దకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేసి బావిలో పడేసి వెళ్లిపోయారు. అనుమానం రాకుండా అతని బైక్ కూడా బావిలో పడేశారు. నిందితులు నాగరాజు, వీరబ్రహ్మంని పోలీసులు అరెస్టు చేశారు. Also Read:
By December 15, 2020 at 03:18PM
No comments