పెళ్లయినా నా పరిస్థితి మారలేదు.. ఇలా ఊహించలేదు: సమంత
‘సినీ ఇండస్ట్రీలో రాణించాలంటే గుమ్మడి కాయంత ప్రతిభ ఉంటే సరిపోదు..ఆవగింజంత అదృష్టం కూడా ఉండాలి’.. అంటారు. అందుకే చాలామంది టాలెంట్ ఉన్నా ఇక్కడ రాణించలేక కనుమరుగై పోతుంటారు. అయితే హీరోయిన్ విషయంలో టాలెంట్, అదృష్టం.. రెండూ భారీగానే ఉన్నాయనే చెప్పాలి. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కొంతకాలానికి అద్భుతమైన కథలు, మంచి పాత్రలతో అదరగొట్టి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
అయితే పెళ్లి తర్వాత కూడా వరుసగా మంచి చిత్రాల్లో నటించగలుగుతున్నానంటే దానికీ తన అదృష్టమే కారణమని చెప్పుకొచ్చింది సామ్. దీనికి సంబంధించి ఓ షోలో చెప్పుకొచ్చింది. హీరోయిన్లు కెరీర్‌కి పెళ్లి అడ్డంకి కాదని నిరూపించడానికి తాను ఏమీ ప్లాన్ చేసుకోలేదని, పెళ్లి తర్వాత తనకు అవకాశాలు రావనే అనుకున్నానని సమంత తెలిపింది. దానికి సిద్ధపడే చైతూని పెళ్లిచేసుకున్నానని, కానీ అదృష్టం కొద్దీ పెళ్లయిన కొద్దిరోజులకే ‘రంగస్థలం’ వంటి భారీ ఆఫర్ వచ్చిందని చెప్పింది. ‘ఆ తర్వాత కూడా ‘మహానటి’, ఓ బేబీ’.. లాంటి మంచి సినిమాల్లో అద్భుతమైన పాత్రలు పోషించగలిగాను. ఈ అవకాశాలన్నీ అదృష్టం వల్లే నాకు దక్కాయి’.. అని చెప్పుకొచ్చింది సమంత. పెళ్లి తర్వాత చాలామంది హీరోయిన్లు అవకాశాలు రాక పూర్తిగా వైవాహిక జీవితానికి పరిమితమైపోతుంటారు. అయితే సమంత విషయంలో ఇలా జరక్కపోవడం విశేషమే.By December 15, 2020 at 07:33AM
No comments