Breaking News

‘వకీల్ సాబ్’కు లీకుల బెడద... ఆన్‌లైన్‌‌లో పవన్, శ్రుతి సాంగ్ ఫోటో


పవర్ స్టార్ నటిస్తున్న తాజా చిత్రం ‘’ను వరుస లీకులు కలవరపెడుతున్నాయి. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి సమాచారం బయటకు పొక్కకుండా యూనిట్ జాగ్రత్తలు తీసుకుంటున్నా దీనికి సంబంధించిన ఫోటోలు ఆన్‌లైన్లో లీక్ అవుతూనే ఉన్నాయి. షూటింగ్‌ ఎంత పార్ట్ పూర్తయింది?, ఈ సినిమాలో పవర్‌స్టార్‌ లుక్‌ ఎలా ఉండబోతుంది? అనే అంశాలపై పవన్ ఫ్యాన్స్‌తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆసక్తి కనబరుస్తున్నారు. ఇటీవల పవర్‌స్టార్‌ ఫొటో ఒకటి బయటికి లీకై యూనిట్‌కి షాకిచ్చిన సంగతి తెలిసిందే. అది మరువకముందే పవన్, శ్రుతిహాసన్ మధ్య ఓ పాట చిత్రీకరణ సందర్భంగా తీసిన ఫోటో ఒకటి ఆన్‌లైన్లో దర్శనమిచ్చింది. అందులో హీరో హీరోయిన్లు ఒకరి చేయి ఒకరు పట్టుకొని కనిపిస్తున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పవన్‌ కల్యాణ్‌ న్యాయవాదిగా కనిపించనున్నారు. శృతిహాసన్‌. పవన్‌, శృతి కాంబినేషన్‌లో ఇది మూడో చిత్రం కావడం విశేషం. Also Read: హిందీలో ఘన విజయం సాధించిన ‘పింక్‌’ చిత్రానికి తెలుగు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తమన్‌ స్వరాలు అందిస్తున్నారు. దిల్‌రాజు, బోనీకపూర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ ఏడాది ఆరంభంలో విడుదలైన ‘మగువా మగువా’ సాంగ్‌ ఇప్పటికీ ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉంది. ముందుగా ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని అనుకున్నప్పటి షూటింగ్ ఆలస్యం కావడంతో వేసవికి ప్లాన్ చేస్తున్నారు.


By December 21, 2020 at 07:50AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/vakeel-saab-movie-another-photo-leaked-in-online/articleshow/79831809.cms

No comments