సింగర్ సునీత ప్రీ వెడ్డింగ్ పార్టీలో సెలబ్రెటీల సందడి
తన గాత్రంతోనే కాదు నిండైన చీరకట్టుతో అందరినీ ఆకట్టుకునే రెండో పెళ్లికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే కుటుంబసభ్యుల సమక్షంలో ‘మ్యాంగో’ రామ్‌తో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. డిసెంబర్‌లోనే పెళ్లికి ఏర్పాట్లు చేసుకున్నప్పటికీ కొన్ని పరిస్థితుల కారణంగా వాయిదా పడింది. పెళ్లికి ఇంకా సమయం ఉండటంతో ఈ జంట తమ స్నేహితులు, సన్నిహితులకు ప్రీ వెడ్డింగ్ పార్టీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిని ఫోటోలు ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ పార్టీని రామ్‌కి అత్యంత సన్నిహితుడైన హీరో నితిన్ ఏర్పాటు చేసినట్లుగా తెలుస్తోంది. గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో జరిగిన ఈ ప్రీ వెడ్డింగ్ పార్టీలో సునీత, రామ్‌లు కేక్ కట్ చేసి సందడి చేశారు. డిసెంబర్ 19న రాత్రి జరిగిన ఈ పార్టీకి పలువురు సెలబ్రెటీలు కూడా హాజరయ్యారు. రేణుదేశాయ్, యాంకర్ సుమ తదితరులు సందడి చేసిన ఫోటోలు బయటికి వచ్చాయి. By December 21, 2020 at 08:50AM
No comments