రాజస్థాన్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి.. ప్రధాని తీవ్ర దిగ్భ్రాంతి
రాజస్థాన్‌లోని ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. శనివారం అర్థరాత్రి దాటిన తర్వాత చిత్తోరగఢ్ జిల్లా సదుల్‌ఖెరా వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. ఉదయ్‌పూర్-నింబాహెరా జాతీయ రహదారిపై జీప్‌ను ఎదురుగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. దీంతో జీపులోని నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంతో మరో 9 మంది గాయపడినట్టు చిత్తోర్‌గఢ్ ఎస్పీ దీపక్ భార్గవ్ తెలిపారు. ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని.. నికుంభా వద్ద జరిగిన ప్రమాదం చాలా బాధాకరమని, బాధితుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. క్షతగాత్రులు తర్వగా కోలుకోవాలని ఆకాంక్షించారు. రాజస్థాన్ సీఎం అశోక్ గహ్లోతా కూడా చిత్తౌడ్‌గఢ్ రోడ్డు ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేశారు. ‘చిత్తోర్‌గఢ్‌లోని నికుంబ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదం చాలా బాధాకరం.. ఇందులో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబాలకు నా సంతాపం. వారికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని, గాయపడినవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. ఈ ప్రమాదంలో గాయపడినవారంతా ప్రస్తుతం చిత్తోర్‌గఢ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. చితోర్‌గఢ్ జిల్లాలోని నికుంభ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ప్రమాదంలో రెండు వాహనాలు తునాతునకలయ్యాయి. స్థానికుల సహాయంతో వాహనంలో చిక్కుకున్నవారిని పోలీసులు బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
By December 13, 2020 at 08:49AM
No comments