తొలి ముద్దుపై కియారా ఓపెన్ కామెంట్స్.. అతనితో సన్నిహితంగా ఉంటున్న రోజుల్లో.. సీక్రట్స్ రివీల్!!
నేటితరం యంగ్ హీరోయిన్స్ ఏదైనా ఓపెన్‌గా మాట్లాడేస్తున్నారు. తమ ఫీలింగ్స్, వ్యక్తిగత విషయాలు చెప్పడంలో ఏ మాత్రం మొహమాటపడటం లేదు. ఈ క్రమంలోనే బాలీవుడ్ బ్యూటీ, మహేష్ బాబు హీరోయిన్ తన ప్రేమ వ్యవహారం, డేటింగ్, తొలి ముద్దు లాంటి విషయాలపై మాట్లాడుతూ ఓపెన్ అయింది. తన లైఫ్ సీక్రెట్స్ వెల్లడించింది. వెండితెరపై ఎంత యాక్టివ్‌గా కనిపిస్తుందో నిజ జీవితంలోనూ అంతే సరదాగా ఉంటూ స్నేహితులను ఆటపట్టిస్తుంటుందట కియారా. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాతో మాట్లాడిన కియారా.. తాను కుటుంబాన్ని బాగా ప్రేమిస్తూ, ఎప్పుడూ కుటుంబం గురించే ఆలోచిస్తూ చాలా ఎమోషనల్‌గా ఉంటానని చెప్పింది. అయితే తన తల్లిదండ్రుల కారణంగా ఓ బాయ్ ఫ్రెండ్‌ను మిస్సయ్యానని తెలిపింది. చిన్నతనం లోనే అతనితో సన్నిహితంగా ఉంటున్న రోజుల్లో తన కుటుంబ సభ్యులు గమనించి.. చదువుపై శ్రద్ధ పెట్టాలని ఒత్తిడి తెచ్చి అతన్ని కలవనీయకుండా చేశారని, ఆ సమయంలో తనకు గుండె పగిలినంత బాధ కలిగిందని చెప్పుకొచ్చింది. కాగా ఏదో ఒక రోజు ఎవరో ఒకరితో మింగిల్ కావల్సిందే కాబట్టి మనసుకు నచ్చిన వాడు దొరికితే డేటింగ్ చేయడానికి వెనకాడనని తెలిపింది కియారా. ఒకవేళ అదే జరిగితే మొదటి డేట్‌లోనే అతనికి ముద్దు మాత్రం ఇవ్వనని, ఊరించి వెంటపడేలా చేస్తానని తన మనసులోమాట బయటపెట్టింది. అయితే ప్రస్తుతానికి తాను సింగల్ అని చెప్పిన ఈ బ్యూటీ.. తాను బాగా ఇష్టపడే ప్రదేశం మాల్దీవ్స్ అని, అక్కడి స్కూబా డైవింగ్ అంటే ఎంతో ఇష్టమని తెలిపింది. Also Read: తెలుగులో మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను', రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ' సినిమాలు చేసిన కియారా అద్వానీ.. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉంది. 'లస్ట్ స్టోరీస్' వెబ్ సిరీస్‌లో స్వయం తృప్తి పొందే మహిళగా బోల్డ్ క్యారెక్టర్ చేసి తన డేరింగ్‌నెస్ బయటపెట్టింది. ఈ వెబ్ సిరీస్ ద్వారా కియారాకు మంచి గుర్తింపు లభించింది.
By December 13, 2020 at 08:41AM
No comments