Breaking News

సత్యదేవ్‌ 'తిమ్మరుసు' ఫస్ట్‌ లుక్ విడుదల


వైవిధ్యమైన చిత్రాలతో హీరోగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంటోన్న సత్యదేవ్‌ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘’. ‘అసైన్‌మెంట్‌ వాలి’ అనేది ట్యాగ్‌లైన్. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్, ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్లపై మహేశ్‌ కోనేరు, శ్రుజన్ ఎరబోలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరణ్‌ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను చిత్ర యూనిట్‌ శనివారం విడుదల చేసింది. డిసెంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేయనున్నారు. Also Read: ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ‘తొలి నుంచి వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ హీరోగా, నటుడిగా సత్యదేవ్‌ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్‌ చేసుకున్నారు. అలాంటి హీరోతో సినిమా చేయడం చాలా సంతోషంగా ఉంది. ‘తిమ్మరుసు’ మంచి కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా. సత్యదేవ్‌ను సరికొత్త కోణంలో ఆవిష్కరించే చిత్రమిది. శనివారం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేస్తున్నాం. డిసెంబర్‌ 9న టీజర్‌ను విడుదల చేస్తాం. షూటింగ్ దాదాపు పూర్తయింది. వచ్చే నెలలో సినిమాను విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం’ అని తెలిపారు. తారాగణం సత్యదేవ్‌, ప్రియాంకా జవాల్కర్, బ్రహ్మాజీ, రవిబాబు, అజయ్‌, ప్రవీణ్‌, అంకిత్ కొయ్య, కేజీఎఫ్ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు సాంకేతిక వర్గం: దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌ సంగీతం: శ్రీచరణ్‌ పాకాల సినిమాటోగ్రఫీ: అప్పూ ప్రభాకర్‌ ఎడిటింగ్ : తమ్మిరాజు సి.జి : అద్విత స్టూడియోస్ అనిల్ పాడూరి ఆర్ట్‌: కిరణ్‌ కుమార్‌ మన్నె యాక్షన్‌: వెంకట్, రియల్ సతీశ్‌, పీఆర్వో: వంశీకాక.


By December 05, 2020 at 12:08PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/satyadev-thimmarusu-movie-first-look-released/articleshow/79578225.cms

No comments