యువతి ప్రాణం తీసిన హెయిర్ క్లిప్.. తిరుపతిలో షాకింగ్ ఘటన
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/79637316/photo-79637316.jpg)
బైక్‌పై ప్రయాణిస్తున్న సమయంలో మహిళలు, యువతులు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పే ప్రమాదకర సంఘటన జరిగింది. బైక్ చక్రంలో చున్నీ పడి ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చూశాం. కానీ.. ఊహించని ప్రమాదాల రూపంలో మనం ధరించిన వస్తువులు సైతం ప్రాణాలు పోయేందుకు కారణమవ్వొచ్చని తెలిపే విషాదకర ఘటన చోటుచేసుకుంది. వర్షం పడుతోందని తీసుకెళ్లిన గొడుగు.. జుట్టు చెదరకుండా పెట్టుకున్న హెయిర్ క్లిప్ ఓ యువతి ప్రాణాలు తీశాయి. ఈ షాకింగ్ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. నగరంలోని నవాబుపేటకి చెందిన షరీన్(22) లీలామహల్ వద్దనున్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తోంది. సోమవారం రాత్రి విధులు ముగించుకుని సహోద్యోగితో కలసి ఇంటికి బయలుదేరింది. మార్గం మధ్యలో వర్షం పడడంతో గొడుగు వేసుకుని బైక్ వెనక కూర్చుంది. అదే ఆమె పాలిట శాపంగా మారింది. వర్షంతో పాటు బలంగా గాలులు వీయడంతో గొడుకు ఒక్కసారిగా వెనక్కి వంగింది. గాలి బలంగా నెట్టేయడంతో షరీన్ బైక్ పైనుంచి అమాంతం కిందపడిపోయింది. తల రోడ్డుకి తగిలి తీవ్రగాయాలపాలైంది. జుట్టు ఎగిరిపోకుండా ఆమె పెట్టుకున్న హెయిర్ క్లిప్ ఇనుప కమ్మీ తలలో గుచ్చుకుపోయింది. గమనించిన స్థానికులు వెంటనే యువతిని 108 అంబులెన్సులో రుయా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ షరీన్ మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బైక్‌లపై ప్రయాణించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. Also Read:
By December 09, 2020 at 10:20AM
No comments