తెలంగాణ బీజేపీలో విషాదం.. జిల్లా నేత సూసైడ్
![](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEhr2RcoK5Nf9NTRnPrStQ3-ZEfWwNyAVOOY6PB6ANhCKZnZochRr_RqPaaDi69eUIGsDRKvoByMaFr3cDoUjes5s8YnYK1JmNBBqqCvhrWe7EYyAph699mJoYmlAtAa9N1iUdMDhRpkjdA/s1600/telugu+news.png)
![](https://telugu.samayam.com/photo/79636761/photo-79636761.jpg)
అమెరికాలో ఉన్నత చదువులు చదివిన యువకుడు ఇండియాకి తిరిగొచ్చి బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితుడై ఆ పార్టీలో చేరాడు. జిల్లా నేతగా కొనసాగుతున్న ఆయన అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ షాకింగ్ ఘటన యాదాద్రి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడుకి చెందిన కొమ్మినేని సైదేశ్వర్‌రావు(30) ఉన్నత చదువులు చదివాడు. అమెరికాలో ఎమ్మెస్ పూర్తి చేశాడు. అనంతరం ఇండియాకి తిరిగొచ్చిన సైదేశ్వర్.. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి ఆ పార్టీలో ఫుల్‌టైమర్‌గా చేరాడు. రెండేళ్లుగా బీజేపీ భువనగిరి జిల్లా కార్యాలయంలో ఉంటున్నారు. ప్రస్తుతం జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్న సైదేశ్వర్ ఆత్మహత్య చేసుకున్నాడు. భువనగిరిలో నూతనంగా నిర్మిస్తున్న కలెక్టరేట్ సమీపంలోని పొలాల్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతదేహాన్ని గమనించిన రైతులు, స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని సైదేశ్వర్‌గా గుర్తించారు. సంఘటన స్థలంలో ఆధారాల కోసం గాలించారు. Also Read: సైదేశ్వర్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు అందులో చనిపోయే ముందు వాయిస్ రికార్డు చేసినట్లు గుర్తించారు. తన చావుకు ఎవరూ కారణం కాదని.. భరించలేని నొప్పుల కారణంగా ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పినట్లు తెలుస్తోంది. బీజేపీ క్షమిస్తుందని కోరుకుంటున్నా. క్షమించు అమ్మా అంటూ వాయిస్ రికార్డు చేసినట్లు సమాచారం. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Read Also:
By December 09, 2020 at 09:40AM
No comments