నిర్మాతతో అల్లు అరవింద్ బేరం.. ‘బాషా’ను వదులుకున్న చిరంజీవి
మెగాస్టార్ కెరీర్లోనే ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా ‘గ్యాంగ్ లీడర్’. విజయ బాపినీడు దర్శకత్వం వహించిన ఈ సినిమా 1991లో విడుదలై ఎన్నో రికార్డులను తిరగరాసింది. చిరంజీవికి ఉన్న మాస్ ఫాలోయింగ్ రెండింతలు చేసింది. దీంతో ఇదే కాంబినేషన్లో మరో సినిమా చేయాలని చిరంజీవి ప్లాన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే విజయ బాపినీడు డైరెక్షన్లో ‘బిగ్ బాస్’ సినిమా మొదలుపెట్టారు. ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతున్న సమయంలో రజినీకాంత్‌తో ‘’ సినిమా తీస్తున్న సురేష్ కృష్ణ చిరంజీవిని కలుసుకున్నారు. సురేష్ కృష్ణ ‘బాషా’ సినిమా స్టోరీని చిరంజీవికి చెప్పి తెలుగులో ఈ సినిమా మీరు తీస్తే బాగుంటుందని సూచించారు. ‘బాషా’ స్టోరీకి ఫిదా అయిపోయిన చిరు ఆ స్టోరీనే తెలుగులో ‘బిస్ బాస్’ పేరుతో తెరకెక్కించాలని నిర్ణయించుకున్నారట. తెలుగు హక్కులు కొనుగోలు చేయాలని తన బావమరిది అల్లు అరవింద్‌కు చెప్పారట. దీంతో రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. ప్రొడ్యూసర్‌తో బేరానికి దిగారట. ఆ నిర్మాత తెలుగు రైట్స్ కోసం రూ.40లక్షలు డిమాండ్ చేయగా.. అరవింద్ రూ.25లక్షలకు అడిగారట. బేరం కుదరకపోవడంతో ఆ సినిమా తెలుగులో రీమేక్‌కు సాధ్యం కాలేదు. 1995లో తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైన ‘బాషా’ సినిమా సంచలన విజయం సాధించింది. రజినీ కెరీర్లోనే బ్లాక్‌బస్టర్‌గా నిలిచిపోయిన ఈ సినిమా తెలుగులో చిరంజీవి చేస్తే ఇంకెంత సంచలనం సృష్టించేదో. కానీ అరవింద్ కారణంగా చిరంజీవి ఆ లక్కీ ఛాన్స్ కోల్పోయారు. మరోవైపు ఎన్నో అంచనాలతో అదే ఏడాది విడుదలైన ‘బిగ్ బాస్’ చిరంజీవి కెరీర్లోనే భారీ డిజాస్టర్‌గా మిగిలింది. అలా ఆ ఏడాది చిరంజీవి రెండు చేదు ఘటనలు ఎదుర్కొన్నారు.
By December 13, 2020 at 10:32PM
No comments