అధికారిణి పరువు తీసిన ఆన్‌లైన్ యాప్.. అవమానంతో.. విషాదం
ఆన్‌లైన్ అప్పుకి మరొకరు బలయ్యారు. అప్పు తిరిగి చెల్లించడం లేదంటూ రుణ సంస్థ అధికారిణి పరువు తీసింది. ఫోన్‌లోని కాంటాక్ట్స్ అందరికీ వాట్సాప్ మెసేజ్‌లు చేయడంతో ఆమె అవమానంతో అఘాయిత్యానికి ఒడిగట్టింది. ఈ విషాద ఘటన జిల్లాలో వెలుగుచూసింది. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాలపేటకి చెందిన మౌనిక(24) ఏఈవోగా పనిచేస్తున్నారు. వారి కుటుంబం కొన్నేళ్లుగా సిద్దిపేటలో నివాసముంటోంది. వ్యాపారంలో తండ్రి నష్టపోవడంతో కుటుంబానికి చేదోడువాదోడుగా నిలిచేందుకు మౌనిక ఆన్‌లైన్ యాప్ స్నాప్‌ఇట్ లోన్ నుంచి రూ.3 లక్షలు రుణం తీసుకున్నారు. అయితే గడువులోగా అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో రుణ సంస్థ ఆమెను డిఫాల్టర్‌గా ప్రకటించింది. అంతటితో ఆగకుండా ఆమె ఫోన్ కాంటాక్ట్స్ లిస్ట్‌లోని అందరికీ ఆమె డిఫాల్టర్ అంటూ వాట్సాప్ మెసేజ్‌లు పెట్టింది. దీంతో అవమానంగా ఫీలైన ఏఈవో మౌనిక ఆత్మహత్యాయత్నం చేశారు. ఆమెను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె ప్రాణాలు విడిచింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. Also Read:
By December 17, 2020 at 09:29AM
No comments