జీవితను హీరోయిన్‌గా వద్దన్న రాజశేఖర్.. హీరోనే మార్చేసిన నిర్మాత
జీవిత-రాజశేఖర్ సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ వీరిద్దరు హిట్ పెయిరే. ఇద్దరూ తమిళనాడుకు చెందిన వారే. ముందుగా తమిళంలోనే కొన్ని సినిమాల్లో నటించి ఆ తర్వాత తెలుగు ఇండస్ట్రీలో స్థిరపడ్డారు. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు తక్కువే అయినా ప్రేక్షకుల మదిలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే ఓ సినిమాలో జీవితను హీరోయిన్‌గా వద్దని నిర్మాతలకు చెప్పారట. తీరా చూస్తే నిర్మాతలు ఆయన్నే హీరోగా తొలగించి మరొకరిని సెలక్ట్ చేశారు. ఈ ఘటన వారిద్దరికి పెళ్లి కాకముందు జరిగింది.
ఓ తమిళ సినిమాకు రాజశేఖర్, హీరోహీరోయిన్లుగా ఎంపిక అయ్యారు. ఆ చిత్రంలో ఎంతో బబ్లీగా, గ్లామరస్‌గా ఉండే పాత్ర జీవితది. హోమ్లీగా కనబడే జీవిత అటువంటి పాత్రలో చేయగలరా అని భావించారట రాజశేఖర్. హీరోయిన్ ఎలా ఉందని ఆ చిత్ర దర్శక, నిర్మాతలు రాజశేఖర్‌ను అడగ్గా తనకు నచ్చలేదని, వెంటనే మార్చేద్దామని చెప్పారట. ఆ మాట విన్న తర్వాత ఆ సినిమా దర్శక, నిర్మాతలు రాజశేఖర్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చి అలాగే చేద్దామని అన్నారట. Also Read: మరో నాలుగు రోజుల్లో షూటింగ్ ఉంటుందని, కారు పంపిస్తామని రాజశేఖర్‌కి చెప్పారట. కానీ పది రోజులైనా వారి నుంచి ఎలాంటి సమాచారం రాకపోవడంతో రాజశేఖర్ ఫోన్ చేశారట. అయితే ఎన్నిసార్లు చేసినా వారు ఫోన్ ఎత్తకపోవడంతో రాజశేఖర్‌కు ఏమీ అర్థం కాలేదట. ఆ తర్వాత పేపర్ చదువుతుండగా ఆ సినిమాకు హీరోని మార్చేశారని తెలుసుకుని షాకయ్యారట. అలా జీవితను హీరోయిన్‌గా వద్దని చెప్పిన రాజశేఖర్ ఆ తర్వాత ఆమెతో ప్రేమలో పడి జీవిత భాగస్వామిగా చేసుకోవడం విశేషం. Also Read:By December 17, 2020 at 09:54AM
No comments