Breaking News

‘పుష్ప’ షూటింగ్‌కు బన్నీ రెడీ.. వచ్చే వారం నుంచి హైదరాబాద్‌లో


అల్లు అర్జున్, కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘’ షూటింగ్‌కు అనుకోని అవాంతరం ఎదురైన సంగతి తెలిసిందే. మారేడుమిల్లి అడవుల్లో షూటింగ్ జరుగుతున్న సమయంలో యూనిట్‌లో కొందరికి కరోనా సోకడంతో ప్యాకప్ చెప్పేశారు. అక్కడ కొన్ని యాక్షన్‌ ఘట్టాలు, పాటల్ని తెరకెక్కించగా... చాలా భాగం ఫారెస్ట్‌లో షూటింగ్ జరుపుకోవాల్సి ఉంది. ఇప్పుడు వారంతా కరోనా నుంచి కోలుకోవడంతో తిరిగి షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే ఇప్పుడే మారేడుమిల్లి వెళ్లకుండా ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో కీలక సన్నివేశాలు చిత్రీకరించేందుకు సుకుమాన్ ప్లాన్ చేస్తున్నాడట. అల్లు అర్జున్‌ ‘పుష్ప’ని వీలైనంత వేగంగా పూర్తి చేయాలనే ఆలోచనలో ఉన్నారట. అందుకే వచ్చేవారమే షూటింగ్ పున:ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ గ్యాప్‌లో నిహారిక పెళ్లి కోసం కుటుంబంతో కలిసి ఉదయ్‌పూర్ వెళ్లిన బన్నీ ఆ వేడుకలో సందడి చేశారు. తిరిగి హైదరాబాద్‌ చేరుకున్న ఆయన ‘పుష్ప’ షూటింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తున్న ‘పుష్ప’ సినిమాలో అల్లు అర్జున్‌ సరసన రష్మిక నటిస్తోంది. శేషాచలం అడవుల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో 9 మంది విలన్లు ఉన్నట్లు సమాచారం.


By December 12, 2020 at 08:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-starrer-pushpa-movie-shooting-re-start-on-next-week-in-hyderabad/articleshow/79689743.cms

No comments