‘సిల్క్ స్మిత’గా రంగమ్మత్త... క్లారిటీ ఇచ్చిన అనసూయ
ఓ వైపు యాంకర్‌గా కొనసాగుతూనే అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ ఉంటుంది అనసూయ. ‘రంగస్థలం’లో రంగమ్మత్త పాత్ర ఆమెలోని ఓ టాలెంటెడ్ నటిని ప్రేక్షకులకు పరిచయం చేసింది. ఆ తర్వాత చిన్న చిన్న పాత్రల్లో తప్ప తనను ఎలివేట్ చేసుకునే పాత్రలో అనసూయ కనిపించలేదు. కొన్ని ఆఫర్లను చేజేతులా వదులుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల ఆమెకు తమిళ హీరో విజయ్ సేతుపతి సినిమాలో ఓ కీలక పాత్ర దక్కింది. అయితే షూటింగ్ లొకేషన్లో తీసుకున్న ఓ ఫోటో కొద్దిరోజులుగా సోషల్‌మీడియా వైరల్‌గా మారింది. Also Read: ఆ ఫోటో ఐటెమ్ బాంబ్ సిల్క్ స్మితను పోలి ఉండటంతో అనసూయ ఆమె బయోపిక్‌లో నటిస్తున్నారంటూ వార్తలు హల్‌చల్ చేశాయి. కొద్దిరోజులుగా జరుగుతున్న ఈ ప్రచారంపై అనసూయ తాజాగా స్పందించింది. ‘నేను సిల్క్ స్మిత గారి బయోపిక్‌లో నటించడం లేదు. దీనిపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవం’ అని క్లారిటీ ఇచ్చింది. అనసూయ తెలుగులో ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడి’, కృష్ణవంశీ ‘రంగమార్తాండ’, విరాజ్ ఆశ్విన్ ‘థ్యాంక్యూ బ్రదర్’ చిత్రాల్లో నటిస్తోంది.
By December 10, 2020 at 11:47AM
No comments