నిహారికకు చిరంజీవి ఇచ్చే గిఫ్ట్ ఇదేనట.. మెగా ఫ్యాన్స్‌లో చర్చ


మెగా బ్రదర్ నాగబాబు ముద్దుల కూతురు పెళ్లితో టాలీవుడ్లో సందడి నెలకొంది. నిహారికను పెళ్లికూతురిని చేసే వేడుకకు సినీ సెలబ్రెటీలు హాజరుకావడంతో ఇప్పుడు ఈ వివాహం గురించే చర్చ జరుగుతోంది. ఈ నెల 9వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో కుటుంబసభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో నిహారికకు జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరగనుంది. అనంతరం హైదరాబాద్‌లో రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. మెగా కుటుంబంలో ఏ శుభకార్యం జరిగినా అందరూ హాజరై సందడి చేస్తుంటారు. సంగీత్ కార్యక్రమంలో కుటుంబసభ్యులందరూ కలిసి డ్యాన్సులు చేసేందుకు రెడీ అవుతున్నారు.
అయితే తమ్ముడు కూతురికి మెగాస్టార్ పెళ్లికానుకగా ఏం గిఫ్ట్ ఇస్తున్నారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చిరంజీవి తన రేంజ్‌కి తగినట్లుగానే నిహారికకు ఖరీదైన గిఫ్ట్ రెడీ చేశారట. అదేంటో తెలుసా.. డైమండ్ నెక్లెస్. దాని విలువ సుమారు రూ.కోటిన్నర ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా తమ కుటుంబానికి కాబోయే అల్లుడు జొన్నలగడ్డ చైతన్యకు కూడా అదిరిపోయే గిఫ్ట్ రెడీ చేశారట. దీంతో నిహారిక పెళ్లిలో చిరంజీవి ఇచ్చే బహుమతే హైలెట్ అవుతుందని మెగా ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. మరి చిరంజీవి ఇచ్చే గిఫ్ట్ అంటే ఆ రేంజ్ ఉండాల్సిందే కదా. Also Read:By December 07, 2020 at 09:00AM
No comments