Breaking News

కొనసాగుతోన్న రైతుల ఆందోళనలు.. ఐఆర్‌సీటీసీ ద్వారా కేంద్రం వారికి మెయిల్స్!


కొత్త వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ఆందోళనలు 18వ రోజుకు చేరుకున్నాయి. పంజాబ్, హరియాణా రైతులు చేపట్టిన ఆందోళనలకు దేశవ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఇదే సమయంలో వ్యవసాయ చట్టాలపై రైతులకు అవగాహన కల్పించి, ఆందోళనలను చల్లార్చడానికి కేంద్రం కూడా ఓ వైపు ప్రయత్నాలు ప్రారంభించింది. ‘ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వంతో సిక్కులతో ఉన్న ప్రత్యేక అనుబంధం’పేరుతో 47 పేజీలతో కూడిన బుక్‌లెట్‌ను ద్వారా పంజాబ్ రైతులకు ఈ-మెయిల్ పంపే కార్యక్రమం ప్రారంభించింది. Read Also: ఐఆర్‌సీటీసీ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ.. రెండు రోజుల కిందట బుక్‌లెట్ విడుదల చేశారని, ప్రజలకు అన్ని ప్రభుత్వ విభాగాల ద్వారా అందజేస్తున్నారు.. ఇది ‘సింగ్’ అనే ఇంటిపేరు ఉన్నవారికి, పంజాబ్ ప్రాంత ప్రజలకు పంపుతున్నాం’ అని అన్నారు. మెయిల్స్ ప్రభుత్వం బహిరంగంగా చేర్చుకోవడంలో భాగమేనని, అంతకన్నా ఎక్కువ ఏమీ చదవకూడదని ఓ సీనియర్ రైల్వే ఉద్యోగి అన్నారు. ఐఆర్‌సీటీసీలో ఈమెయిల్ ఐడీలతో టిక్కెట్లు బుక్‌చేసుకునే వారికి ఈ బుక్‌లెట్‌లు చేరుతున్నాయి. [email protected] ద్వారా ముఖ్యంగా సిక్కు వర్గాలకు మెయిల్ పంపుతున్నారు. Read Also: హిందీ, పంజాబీ, ఇంగ్లిష్‌లో భాషలలో ఉండే ఈ బుక్‌లెట్‌ ప్రధానికి ప్రదానం చేసిన క్వామి సేవా అవార్డు ప్రస్తావనతో మొదలవుతుంది.. 13 హెడ్‌లైన్స్ కింద ప్రభుత్వం తీసుకున్న చర్యలను వివరించారు. శ్రీ హర్మిందర్ సాహిబ్‌కు ఎఫ్‌సిఆర్‌ఎ రిజిస్ట్రేషన్ మంజూరు’;‘ప్రపంచ సంగత్‌లో పాల్గొనడానికి అనుమతి; ‘తొలిసారిగా లాంగర్‌పై ఎలాంటి పన్నులు విధించకపోవడం’; ‘కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభం’; ‘మూడు దశాబ్దాల కిందట సిక్కుల ఊచకోత బాధితుల కన్నీళ్లు తుడవడం.. న్యాయం చేయడం.; ‘జలియన్ వాలా బాగ్ మెమోరియల్ - త్యాగధనులను గౌరవించడం.. అనుమానిత జాబితాను తగ్గించడం.. భుజం తట్టి మద్దతు ఇవ్వడం’ తదితర అంశాలను ప్రస్తావించారు. Read Also: ప్రధాని నరేంద్ర మోదీ ఫోటోలతో కూడిన ఈ బుక్‌లెట్‌ను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ముద్రించింది. అయితే, ఐఆర్‌సీటీసీ తమ ఐడిలకు మెయిల్ ద్వారా పంపడాన్ని ట్విట్టర్‌లో స్పందించారు. పార్టీ ప్రచారాల కోసం మా డేటాను ఉపయోగించడానికి ఐఆర్‌సీటీ అనుమతించాలా ? సిక్కులలో ప్రభుత్వ వ్యతిరేక భావాలను చల్లబరచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని కూడా లక్ష్యంగా చేసుకున్నారు. మంచి వ్యూహం ’ అన్నారు. Read Also: చెన్నైలోని గురు నానక్ ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడు రాజేంద్ర సింగ్ భాసిన్ మాట్లాడుతూ.. సోషల్ మీడియా, సాంకేతికతను ఉపయోగించుకుని ప్రభుత్వం తన అభిప్రాయాలను ప్రజలపై రుద్దే ప్రయత్నం చేస్తోంది.. రైతుల డిమాండ్లను, ఆందోళనలను కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదో నాకు ఆశ్చర్యం కలుగుతోందన్నారు.


By December 13, 2020 at 02:05PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amid-farmers-protest-centre-reaches-out-to-sikhs-by-email-through-irctc/articleshow/79705104.cms

No comments