Breaking News

హీరో వేణు తొట్టెంపూడి సినిమాలకు దూరం కావడానికి కారణం అదేనా?


తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది హీరోలు తమ టాలెంట్‌తో హీరోలుగా ప్రేక్షలకులను అలరించారు. అయితే వారంతా ఎంత వేగంగా కెరీర్లో పైకి ఎదిగారో అంతే వేగంగా కనుమరుగైపోయారు. అలాంటి వారిలో హీరో ఒకరు. ఫ్యామిలీ ఆడియన్స్‌లో ఎంతో క్రేజ్ తెచ్చుకున్న వేణు సడెన్‌గా సినీ ఇండస్ట్రీని వదిలేశారు. తొలి సినిమా ‘స్వయంవరం’తో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన వేణు ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో తనదైన మార్క్ కామెడీ, సెంటిమెంట్‌తో ప్రేక్షకులను అలరించారు. ఆరడుగుల పొడగు ఉన్నప్పటికీ తన బాడీ ఇమేజ్‌కి తగినట్లుగా పాత్రలను ఎంపిక చేసుకుని హీరోగా మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. Also Read: సుమారు 26 సినిమాల్లో హీరోగా నటించిన వేణు తొట్టెంపూడి కెరీర్లో ఎక్కువ శాతం హిట్లే. స్వయం వరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ , పెళ్ళాం ఊరెళితే , ఖుషి ఖుషీగా.. ఇలా 15 సినిమాలు విజయం సాధించాయి. 2006 తర్వాత సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్న వేణు 2012లో ఎన్టీఆర్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘దమ్ము’ సినిమాలో కీలక పాత్రలో కనిపించాడు. ఆ తర్వాత రామాచారి అనే సినిమా చేయగా అది పరాజయం పాలైంది. ఈలోగా వ్యాపార కార్యకలాపాల్లో తలమునకలు కావడంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యాడు Also Read: హీరోగా ఎన్నో సినిమాలతో ప్రేక్షకులను నవ్వించిన వేణు తొట్టెంపూడి వ్యక్తిగత విషయాలు మాత్రం చాలా తక్కువ మందికి తెలుసు. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలోనే 200లో అనుపమ చౌదరి అనే అమ్మాయిని వేణు పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. 2013 తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన వేణు 2019లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ తరపున ప్రచారం చేశాడు. ఆయన బావ నామా నాగేశ్వరరావు ప్రస్తుతం టీఆర్ఎస్ తరపు ఖమ్మం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం వ్యాపార కార్యకలాపాలతో బిజీగా ఉన్న వేణు భవిష్యత్తులో మళ్లీ సినిమాల్లో నటిస్తారో? లేక రాజకీయాల వైపు మళ్లుతారో? చూడాలి మరి.


By December 15, 2020 at 09:56AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/hero-venu-thottempudi-personal-details/articleshow/79725174.cms

No comments