బాత్రూమ్‌లో శవమై కనిపించిన కూతురు.. మల్కాజ్‌గిరిలో విషాదం
కుటుంబ సభ్యులు బయటికి వెళ్లి ఇంటికి తిరిగొచ్చేసరికి కూతురు శవమై తేలింది. బాత్రూమ్‌లో కాలిపోయిన స్థితిలో కూతురిని చూసి తల్లి షాక్‌కి గురైంది. 108 సిబ్బంది వచ్చి పరీక్షించి అప్పటికే ఆమె చనిపోయినట్లు చెప్పడంతో హతాశురాలైంది. జీవితంపై విరక్తితో ఆత్మహత్య చేసుకుంటున్నట్లు కూతురు సూసైడ్ నోట్ రాసి పెట్టినట్లు తెలుస్తోంది. ఈ అత్యంత విషాద ఘటన నగరంలో చోటుచేసుకుంది. పరిధిలోని సర్దార్ పటేల్ నగర్‌కి చెందిన ఎల్లేష్, చంద్రకళ దంపతులకి కుమారుడు పవన్ కుమార్, కూతురు తనూష(17) సంతానం. ఇంటర్ సెకండియర్ చదువుతున్న తనూష లాక్‌డౌన్ కారణంగా ఇంటి వద్దే ఉంటోంది. ఏమైందో ఏమో తెలియదు అనూహ్యంగా ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు పనిమీద బయటికి వెళ్లిన సమయంలో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం సమయంలో ఇంటికి తిరిగొచ్చిన చంద్రకళ.. బాత్రూమ్‌లో కాలిన గాయాలతో విగతజీవిగా పడి ఉన్న కూతురిని చూసి కుప్పకూలిపోయింది. వెంటనే భర్తకి ఫోన్ చేసి విషయం చెప్పింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని యువతిని పరీక్షించి అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. అయితే తన చావుకు తల్లిదండ్రులు కారణం కాదని.. జీవితంపై విరక్తితోనే చనిపోతున్నట్లు తనూష రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. Also Read: Read Also:
By December 15, 2020 at 10:07AM
No comments