నాన్న వల్లే నటుడినయ్యా.. నా టాలెంట్ నిరూపించుకుంటా : సంజయ్ రావు
‘పిట్టకథ’ సినిమాతో అందరిని అలరించిన కొడుకు హీరోగా నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ప్రస్తుతం ఆయన చేతిలో మూడు సినిమాలున్నాయి. ‘పిట్టకథ’లో మిడిల్ క్లాస్ అబ్బాయిగా కనిపించిన సంజయ్.. విభిన్న కథలతో తెరకెక్కుతున్న సినిమాల్లో నటిస్తున్నాడు. రొమాంటిక్, యాక్షన్ హీరోగా సరికొత్త కథ, కథనాలతో తెలుగు ప్రేక్షకులని అలరించడానికి వస్తున్నాడు. డాన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లో తెరకెక్కే యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రం డిసెంబర్ రెండో వారంలో ప్రారంభం కానుంది. మరో రెండు సినిమాలు వచ్చే జనవరిలో ప్రారంభమవుతాయి.
ఈ సందర్భంగా సంజయ్ రావు మాట్లాడుతూ ‘పిట్టకథ’ సినిమాతో నన్ను ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మరో మూడు విభిన్న చిత్రాలతో మీ ముందుకు వస్తున్నాను. వీటిలో ఒకటి రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ కాగా. మరొకటి యాక్షన్ థ్రిల్లర్, ఇంకొకటి మర్డర్ మిస్టరీ చిత్రం. ఈ మూడు కథలు నాకు చాలా బాగా నచ్చాయి. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని డాన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ వారు నిర్మిస్తున్నారు. డిసెంబర్ రెండో వారంలో షూటింగ్ స్టార్ట్ అవుతుంది. మిగతా రెండు సినిమాలు 2021 జనవరిలో ప్రారంభమవుతాయి. వీటితో పాటు నిత్యాశెట్టితో ఓ వెబ్ సిరీస్ చేశాను. అది త్వరలోనే రిలీజ్ అవుతుంది’ అని చెప్పారు. ‘మా నాన్న బ్రహ్మాజీ వల్ల నాకు మొదట్లో అవకాశం వచ్చింది. దాన్ని నిలబెట్టుకోవాల్సింది నేనే. నా టాలెంట్ చూసి నాకు అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. కేవలం హీరోగానే కాదు, మనసుకు నచ్చితే ఎలాంటి క్యారెక్టర్ అయినా చేస్తా.. విలన్‌గా అయిన చేసేందుకు సిద్ధమే’ అని సంజయ్ రావు తెలిపారు. Also Read:By December 11, 2020 at 12:09PM
No comments