భూమిపైకి దిగుతూ గాల్లోనే పేలిపోయిన స్టార్‌షిప్.. ప్రయోగం విజయమైందని స్పేస్‌ఎక్స్ ప్రకటన
అమెరికాకు చెందిన ప్రయివేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ ‘స్పేస్‌ఎక్స్’ స్టార్ షిష్ రాకెట్ ల్యాండింగ్ సమయంలో కూలిపోయింది. టెక్సాస్ తీరంలో ఈ రాకెట్ పేలిపోయినట్టు వెల్లడించిన స్పేస్‌ఎక్స్.. ఆ దృశ్యాలను ట్విట్టర్ ద్వారా ప్రసారం చేసింది. చంద్రుడు, అంగారకుడిపైకి మానవులను, సామగ్రిని తీసుకెళ్లి, తిరిగి భూమిపైకి సురక్షితంగా తీసుకొచ్చేందుకు స్పేస్‌ఎక్స్.. స్టార్‌షిప్ పేరుతో వ్యోమనౌకలను రూపొందిస్తోంది. ఆ రాకెట్ల పనితీరును అంచనా వేయడానికి తొలుత నమూనా రాకెట్లతో ప్రయోగాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగానే బుధవారం ఈ ప్రయోగం నిర్వహించినట్టు తెలిపింది. ప్రయోగంలో భాగంగా నంబర్ 8 రాకెట్‌లోని లోహ కవచ దృఢత్వం, మూడు ఇంజిన్ల పనితీరు, రాకెట్ తిరిగి భూమిపైకి చేరుకునే సమయంలో ఎదురయ్యే సవాళ్లు వంటివి అంచనా వేశారు. రాకెట్ తొలుత నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం రాకెట్ నిర్ణీత ఎత్తుకు వెళ్లిన తర్వాత రెండు ఇంజిన్లు ఆగిపోయాయి. దీంతో అది భూమిపైకి తిరుగు ప్రయాణం ప్రారంభించింది. సరిగ్గా 4.45 గంటలకు మూడో ఇంజిన్ కూడా ఆగిపోయింది. గురుత్వాకర్షణ శక్తి ప్రభావంతో భూమిపైకి అత్యంత వేగంగా దూసుకొస్తున్న రాకెట్‌ను అదుపు చేయడానికి తొలుత ఆగిపోయిన రెండు ఇంజిన్లను తిరిగి ప్రారంభించారు. అయితే, వేగాన్ని నియంత్రించుకునే విషయంలో విఫలం కావడంతో రాకెట్ నేరుగా భూమిని ఢీకొట్టి పేలిపోయింది. ‘ఇది అద్భుత ప్రయోగం.. స్టార్‌షిప్ బృందానికి అభినందనలు’ తెలియజేసింది. ‘ఇలాంటి పరీక్షల్లో విజయం నిర్దిష్ట లక్ష్యాలను పూర్తి చేయడం కొలమానం కాదు.. కానీ మనం ఎంత నేర్చుకోగలం, ఇది భవిష్యత్తులో విజయానికి సంభావ్యతను తెలియజేస్తుంది.. మెరుగుపరుస్తుంది, ఎందుకంటే స్పేస్ఎక్స్ వేగంగా స్టార్‌షిప్ అభివృద్ధిని చేస్తుంది’అని పేర్కొంది. ‘మార్క్, మేము ఇక్కడకు వచ్చాం’ అంటూ ట్వీట్ చేశారు. రాకెట్ పేలిపోయినా తమకు కావాల్సిన విలువైన సమాచారం మాత్రం దొరికిందని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు టెస్లాస్ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. తరువాతి తరం రాకెట్లను మెరుపు వేగంతో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో చేసిన పరీక్షల శ్రేణిలో భాగంగా నిర్వహించిన ప్రయోగంలో చిన్న ప్రోటోటైప్‌లు నిమిషం వ్యవధిలో గాల్లోని వందల మీటర్లు దూరంలోనే పేలిపోయిందని తెలిపారు. భారీ మెటల్ బాడీ, దాని మూడు ఇంజిన్‌ల ఏరోడైనమిజం పరిశీలించడానికి రూపొందించిన ఈ రాకెట్ స్పేస్‌ఎక్స్ రూపొందించిన ఫాల్కన్ 9 మాదిరిగానే ఉంటుంది.
By December 11, 2020 at 08:54AM
No comments