Breaking News

ఆ హీరోతో లిప్‌లాక్‌ చేస్తా: సమంత షోలో ఓపెన్ అయిన తమన్నా


సినీ ఇండస్ట్రీలో దశాబ్దానికి పైగా కొనసాగుతున్న అతికొద్దిమంది హీరోయిన్లలో మిల్కీ బ్యూటీ ఒకరు. తొలినాళ్లలో వరుస పరాజయాలతో ఐరన్‌ లెగ్ అన్న ముద్రపడినా.. ధైర్యంగా విమర్శలన్నింటినీ ఎదుర్కొని నిలబడింది. గ్లామర్‌తో రెచ్చిపోతూనే తనలోనూ ఓ మంచి నటి ఉందని కొన్ని సినిమాలతో నిరూపించుకుంది. అయితే గ్లామర్ విషయంలో వెనుకాడని తమన్నా ఇప్పటివరకు ఏ సినిమాలోనూ హీరోకూ లిప్‌లాక్ ఇవ్వలేదు. అయితే లిప్‌లాక్ ఇవ్వాల్సి వస్తే ఓ హీరోకు ఇస్తారని అడిగితే ఎవరు పేరు చెప్పిందో తెలుసా.. తెలుగు ఓటీటీ ఆహాలో హోస్ట్ చేస్తున్న 'సామ్‌ జామ్‌' షోలో తమన్నా పాల్గొంది. ఈ ఎపిసోడ్‌కు సంబంధించి ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఈ సందర్భంగా తమన్నాకు లిప్‌లాక్‌కు సంబంధించిన ప్రశ్న ఎదురైంది. 'నో కిస్సింగ్‌ ఆన్‌ స్ర్కీన్‌ రూల్‌ బ్రేక్‌ చేస్తే.. ఎవరితో కిస్‌ చేయడానికి ఇష్టపడతావు?' అని సమంత అడగ్గా... తమన్నా తడుముకోకుండా.. ‘ఐ లైక్‌ టు కిస్‌.. విజయ్‌ దేవరకొండ’ అని చెప్పింది. దీంతో ప్రేక్షకులు ఈలలు, చప్పట్లతో సందడి చేశారు. ‘రెడీ ఈజ్ రెడీ ఫర్ ద షో’ అంటూ సమంత హడావుడి చేసింది. గతంలో ఓ షోలో తమన్నాకు ఇదే ప్రశ్న ఎదురైతే హృతిక్‌ రోషన్ పేరు చెప్పింది. ఇప్పుడేమో విజయ్ దేవరకొండ ఆ స్థానాన్ని ఆక్రమించేశాడు. ఇటీవలే కరోనా నుంచి కోలుకున్న తమన్నా షూటింగుల్లో పాల్గొంటోంది. మరోవైపు విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరీ జగన్నా్థ్ డైరెక్షన్లో ‘ఫైటర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు.


By December 11, 2020 at 08:30AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/i-want-to-ready-for-lip-kiss-with-vijay-devarakonda-say-tamannah/articleshow/79672911.cms

No comments