Breaking News

శోభనం రాత్రే నవవధువుకు షాక్.. నైటీ వేసుకొని భర్త వింత ప్రవర్తన


పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. రెండు మనుషుల్ని ఒక్కటిగా చేసేదే పెళ్లి. అందుకే కొత్త దాంపత్య జీవితాన్ని కోటి ఆశలతో ప్రారంభిస్తారు. అలా ఎన్నో కలలతో సంసార జీవితాన్ని ప్రారంభించిన ఓ యువతికి భర్త షాక్ ఇచ్చాడు. మొదటి రాత్రి అతడు చేసిన వింత ప్రవర్తనతో ఆమె భయాందోళనలకు గురైంది.ఈ ఘటన ఏపీలో గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. తనపై భర్త పైశాచికంగా ప్రవర్తించి, గాయపరిచాడంటూ సోమవారం నవవధువు గుంటూరు రూరల్‌ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు వివరాల్ని పరిశీలిస్తే... ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. నరసరావుపేటకు చెందిన యువతి సైతం సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. అక్టోబరు నెలలో వీరిద్దరికి వివాహమైంది. అయితే పెళ్లి అనంతరం వీరికి మొదటిరాత్రి ఏర్పాటు చేశారు. అయితే తొలిరాత్రే భర్త ప్రవర్తనతో.. భయపడుతున్నాడని భావించి రోజులు గడుపుకుంటూ వచ్చారు. రెండురోజుల కిందట మళ్లీ మొదటి రాత్రి ఏర్పాటు చేయగా అతను, ఆమె నైటీ వేసుకొని వింతగా ప్రవర్తించాడు. దీంతో నవవధువుకు షాక్‌కు గురైంది. Read More: అంతేగాక ఆమెకు మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చాడు. బ్లేడ్‌తో ఆమె మర్మావయాలు, శరీరంపై గాయాలు చేశాడు. వధువు ఈ విషయాన్ని పెద్దలకు తెలియజేసింది. దీంతో వాళ్లు వరుడి బంధువులను సంప్రదించగా వధువే సంసారానికి పనికిరాదంటూ గొడవపెట్టుకున్నారు. దీంతో గాయాలతో ఉన్న ఆమెను తీసుకొని తల్లిదండ్రులు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. స్పందన అధికారులు వెంటనే నరసరావుపేట పోలీసులకు సమాచారం ఇచ్చి ఆమె ఫిర్యాదుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.


By December 22, 2020 at 07:50AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/bride-shock-on-first-night-with-husband-strange-behavior/articleshow/79849199.cms

No comments