Breaking News

మధ్యప్రదేశ్: పెళ్లి బృందం వాహనం బోల్తా.. వరుడి సహా ఆరుగురు మృతి


మధ్యప్రదేశ్‌లో శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఖండ్వా-బైతూల్ జాతీయ రహదారిపై చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో వరుడు సహా ఆరుగురు మృతి చెందారు. మెహ్లూ గ్రామం వద్ద పెళ్లి బృందం వాహనం బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఆరుగురు చనిపోగా.. 30 మంది గాయపడ్డారు. వీరిలో మరో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను హర్సూద్, ఖాల్వాలలోని ఆసుపత్రులకు తరలించారు. ఖాల్వా గ్రామానికి చెందిన కున్వర్ సింగ్‌ వివాహా వేడుక కోసం 35 మందికిపైగా ట్రాక్టర్ ట్రాలీలో ఊరేగింపుగా బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం మహులా గ్రామానికి సమీపంలో కల్వర్టు వద్ద అదుపుతప్పి పక్కనే ఉన్న 15 అడుగుల లోతైన వ్యవసాయ కాల్వలోకి దూసుకెళ్లింది. దీంతో వాహనంలోని వారంతా ట్రాలీ కింద చిక్కుకుపోయారు. తీవ్రంగా గాయపడిన వరుడు కున్వర్, భగవతి బాయ్, సూరజ్‌బాయ్, బుధియాబాయ్, తులసి బాయ్, గోపీబాయ్ ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులకు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను ఐదు అంబులెన్స్‌ల్లో ఆస్పత్రికి తరలించారు. ఖండ్వా కలెక్టర్ ద్వివేది, ఎస్పీ వివేక్ సింగ్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. రెయిలింగ్‌ను ఢీకొని ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిందని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ప్రమాదంపై మధ్యప్రదేశ్ సీఎం శివ్‌రాజ్ సింగ్ చౌహన్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంతో సంతోషంగా ఉండాల్సిన సమయంలో ఇటువంటి విషాదం చోటుచేసుకుందని ఆవేదన చెందారు. ఈ నష్టాన్ని ఎవ్వరూ భర్తీచేయలేరని, బాధిత కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.


By December 04, 2020 at 09:07AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/tractor-trolley-filled-with-weeds-6-including-the-groom-killed-in-madhya-pradesh/articleshow/79558511.cms

No comments