డైరెక్టర్‌ని చితకబాదిన కీర్తి సురేష్.. నెక్ట్స్ రివేంజ్ నితిన్ పైనే..
నితిన్, జంటగా తెరకెక్కుతున్న రొమాంటిక్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘రంగ్ దే’. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘తొలిప్రేమ’తో ఇండస్ట్రీని ఆకర్షించిన డైరెక్టర్. ఇప్పటికే విడుదలైన టీజర్ సినిమా అంచనాలను భారీగా పెంచేసింది. ప్రస్తుతం దుబాయిలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి లొకేషన్లో జరుగుతున్న సరదా సంఘటనలు అందరినీ అలరిస్తున్నాయి.
కొద్దిరోజుల క్రితం షూటింగ్ లొకేషన్లో కీర్తి సురేష్ నిద్రపోతుండగా.. నితిన్, వెంకీ ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్ సెట్‌లో మేమంతా చెమటలు పట్టేలా కష్టపడుతుంటే కీర్తి మాత్రం ఎలా నిద్రపోతుందో చూడండి అంటూ నితిన్ చేసిన పోస్ట్ తెగ వైరల్ అయింది. దీనిపై స్పందించిన కీర్తి నాకు గుణపాఠం నేర్పారు.. మీపై పగ తీర్చుకుంటానని హెచ్చరించింది. Also Read: సవాల్ చేసినట్లుగా కీర్తి సురేష్ తన మొదటి ప్రతీకారం తీర్చుకుంది. డైరెక్టర్ వెంకీని లొకేషన్లోనే పరుగెత్తించి మరీ గొడుగుతో చితకబాదింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసి ఒక పని పూర్తయిందని కామెంట్ చేసింది. హీరో నితిన్‌ని ట్యాగ్ చేస్తూ.. నీపై త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటానంటూ హెచ్చరించింది. దీనిపై స్పందించిన నితిన్.. ‘ఐయామ్ వెయిటింగ్’ అంటూ స్పందించారు. ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. Also Read:By December 04, 2020 at 09:12AM
No comments