Breaking News

నడిరోడ్డుపై ఇనుప రాడ్లతో కొట్టి దారుణ హత్య.. వీడియోలు తీశారు కానీ...


నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఇనుప రాడ్లతో దారుణంగా కొట్టి హత్యచేసిన ఘటన దేశ రాజధాని ఢిల్లీ శివారులో చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వైపు కార్లు, బైక్‌లతో రహదారి బిజీగా ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు కర్రలతో చితకబాదుతుంటే ఆపడానికి ఎవ్వరూ ముందుకురాలేదు సరికదా.. బాధితుడిని కనీసం ఆస్పత్రికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటనలో అజయ్ అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. అతడికి కొడుతుంటే అటువైపుగా వెళ్లినవారు చోద్యం చూశారు. వీడియోలు తీశారు కానీ ఒక్కరంటే ఒక్కరు ఆపే ప్రయత్నం చేయకపోవడం బాధాకరం. పూల దుకాణం ఏర్పాటు విషయంలో మొదలైన వివాదం చినికి చినికి గాలివానలా మారి హత్యచేసే వరకు వెళ్లింది. బాధితుడు అజయ్, నిందితుల మధ్య కొద్దిరోజులుగా వివాదం నెలకుంది. నిందితులపై కొద్ది రోజుల కిందటే అజయ్ సోదరుడు సంజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కానీ, ఇరువర్గాల మధ్య వారు రాజీ కుదిర్చారు. రాజీ కుదిరిన తర్వాత అజయ్‌‌పై నిందితుడు గోవింద్ దాడిచేశాడు. తన మిత్రుడు అమిత్ సాయంతో అజయ్‌పై దాడికి పాల్పడ్డాడు. వారి నుంచి తప్పించుకోడానికి బాధితుడు పారిపోతుంటే వారు వెంబడించి కొడుతున్న దృశ్యాలు వీడియోలు కనిపిస్తున్నారు. రక్తమోడుతున్న శరీరంతో ప్రాణభయంతో పరుగులు పెడుతున్నా కనీసం ఎవ్వరూ మానవత్వం చూపలేదు. అతడి ఆర్తనాదాలు విని సాయం చేయడానికి ముందురాకపోగా.. వీడియో తీశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. కేసు నమోదుచేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ‘లోని ఆలయం సమీపంలో నిందితుడు గోవింద్ గత ఏడేళ్లుగా పూల దుకాణం నిర్వహిస్తున్నాడు.. అయితే, ఎనిమిది నెలల కిందట అజయ్ దుకాణం ప్రారంభించడంతో అతడి వ్యాపారం పడిపోయింది. దీంతో అజయ్‌పై కక్షపెంచుకున్న గోవింద్ అతడిని చంపడానికి స్నేహితులతో కలిపి పథకం వేశాడు’ అని ని ఎస్పీ ఇరాజ్ రాజా తెలిపారు. ‘అజయ్ దుకాణం మూసివేసి ఆటోలో ఇంటికి వెళ్తుండగా అతడిని వాహనంలో నుంచి కిందికి లాగి ఐరన్ రాడ్‌తో దాడిచేశాడు. అజయ్ తలపై మూడు నాలుగుసార్లు బలంగా మోదాడు.. అటువైపు వెళ్తున్నవారు వీడియో తీశారు కానీ, ఎవ్వరూ ఆపే ప్రయత్నం చేయలేదు.. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని బాధితుడిని ఆస్పత్రికి తరలించినా అప్పటికే అతడు చనిపోయాడు’అని ఎస్పీ పేర్కొన్నారు.


By December 29, 2020 at 10:06AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/man-beaten-to-death-on-ghaziabad-busy-road-near-delhi-no-one-helps/articleshow/80003847.cms

No comments