కేరళ స్థానిక ఎన్నికలు: ఓటర్లకు రోబో సేవలు.. దేశంలోనే తొలిసారి
ఆధునికతను అందిపుచ్చుకోవడంలో దేశంలోనే కేరళ ముందుంటుంది. తాజాగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో రోబోట్లను వినియోగించడం విశేషం. కోవిడ్-19 నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు సహాయపడేందుకు రోబోలను ఏర్పాటుచేశారు. రెండో దశ ఎన్నికల సందర్భంగా ఎర్నాకుళం జిల్లా త్రికక్కర మున్సిపల్ పోలింగ్ కేంద్రంలో ఓటర్లకు విశిష్ఠ సేవలు అందజేయడానికి వీలుగా అనే రోబోను వినియోగించారు. పోలింగ్ కేంద్రం ప్రవేశ ద్వారం వద్ద ఉన్న ‘సయాబోట్’ రోబో ఓటు వేసేందుకు కేంద్రానికి వచ్చిన ఓటర్లను పలకరించి వారి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేసి, ఓటు వేసే ముందు వారికి శానిటైజర్లను ఇస్తోంది. Read Also: ఓటేయడానికి వచ్చేవారికి సాధారణ ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా ఉన్నట్లు గుర్తిస్తే రోబో ప్రకటన చేసి పోలింగ్ అధికారిని సంప్రదించాలని, వీరు ఓటేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేశారని సలహా ఇచ్చింది. ఓటర్లు ఫేస్ మాస్కు సరిగ్గా ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచిస్తోంది. ఓటర్లు శానిటైజర్ లేకుండా పోలింగ్ కేంద్రానికి వస్తే వారి చేతులను శుభ్రం చేయడానికి శానిటైజర్ అందజేస్తుందని ఎర్నాకుళం కలెక్టరు ఎస్ సుహాస్ వివరించారు. పోలింగ్ కేంద్రంలో రోబో సేవలను ప్రయోగాత్మకంగా ప్రవేపెట్టి పరిశీలించామని, తర్వాత ఇతర పోలింగ్ కేంద్రాల్లోనూ ఈ రోబోలను ప్రవేశపెడతామని ఆయన పేర్కొన్నారు. Read Also: ‘ఓటర్ల నుంచి స్పందన అద్భుతంగా ఉంది. మేము రెండు రోజుల విధుల కోసం రోబోట్‌ను ప్రోగ్రామింగ్ చేశాం.. ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయి.. ఇది శరీర ఉష్ణోగ్రతలను తనిఖీ చేస్తుంది.. ఓటరుతో ఒక నిమిషం పాటు సంభాషిస్తుంది.. పోలింగ్ కేంద్రంలో రోబోను ఉపయోగించడం ఇదే మొదటిసారి. ఇది పెద్ద విజయం’ అని అసిమోవ్ రోబోటిక్స్ సీఈఓ జయకృష్ణన్ అన్నారు. సయాబోట్ రోబోను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. ఇక, రెండో దశలో గురువారం ఎర్నాకులం, కొట్టాయం, త్రిసూర్, పాలక్కడ్, వాయనాడ్ సహా ఐదు జిల్లాల్లో పోలింగ్ నిర్వహించారు. వచ్చే ఏడాది కేరళ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. Read Also:
By December 11, 2020 at 09:24AM
No comments