చిత్ర మొహంపై గాయాలు.. షాకింగ్ విషయం బయటపెట్టిన పోస్టుమార్టం రిపోర్ట్
తమిళ టీవీ నటి వి.జె.చిత్ర ఆత్మహత్య కేసులో పోస్టుమార్టం కీలక విషయాలు వెల్లడించింది. ఆమె తల్లిదండ్రులు, బంధువులు అనుమానిస్తున్నట్లుగా చిత్ర మృతి ఘటనలో ఎలాంటి అనుమానాస్పద విషయాలు లేవని, ఆమెది కచ్చితంగా ఆత్మహత్యేనని డాక్టర్లు తేల్చారు. చెన్నైలోని తిరువాణ్మియూర్‌కి చెందిన చిత్ర(28) అనేక టీవీ సీరియళ్లతో పాటు పలు సినిమాల్లో చిన్నచిన్న పాత్రల్లో నటించింది. వ్యాపారవేత్త హేమంత్ రవితో ఆమెకు ఆగస్టులో నిశ్చితార్థం జరగ్గా.. అక్టోబరులో వారిద్దరు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. Also Read: ఈ నేపథ్యంలోనే ఓ షూటింగ్ నిమిత్తం చిత్ర పూందమల్లిలోని నజరత్‌పేట్టైలో గల ఫైవ్ స్టార్ హోటల్‌లో భర్తలో కలిసి బస చేసింది. బుధవారం తెల్లవారుజామున షూటింగ్ పూర్తి చేసుకుని హోటల్ గదికి చేరుకుంది. స్నానం చేసి వస్తానని భర్తకు చెప్పి గదిలోకి వెళ్లి తలుపేసుకుంది. ఆమె ఎంతసేపటికి తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన హేమంత్ హోటల్ సిబ్బంది సాయంతో తలుపు తెరిచి చూడగా చిత్ర ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. Also Read: తమ కూతురిని ఆత్మహత్య కాదని, ఇందులో నిజానిజాలు తేల్చాలని చిత్ర తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆమె మృతదేహానికి కీళ్పాక్కం ప్రభుత్వాసుపత్రిలో గురువారం పోస్టుమార్టం నిర్వహించారు. ఆమెది కచ్చితంగా ఆత్మహత్యేనని, చిత్ర మొహంపై ఉన్న గోళ్ల గాయాలు ఆమె గోళ్లతో రక్కుకోవడం వల్లే అయ్యాయని డాక్టర్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్ర ఆత్మహత్య చేసుకునేలా ఎవరు ప్రేరేపించారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
By December 11, 2020 at 09:52AM
No comments