Breaking News

వివాహానికి వెళ్లొస్తుండగా ప్రమాదం.. ఎనిమిది మంది మృతి


ఉత్తర్‌ ప్రదేశ్‌లో బుధవారం తెల్లవారుజామున ఘోర సంభవించింది. ఈ ప్రమాదంలో ఎనిమిది ప్రాణాలు కోల్పోయారు. కౌశాంబి జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృతిచెందారు. ఈ కుటుంబం బంధువుల వివాహానికి హాజరైన వస్తున్న సమయంలో ఎదురుగా వచ్చిన ట్రక్కు ఢీకొట్టింది. సామర్ధ్యానికి మించిన ఇసుక లోడుతో వస్తున్న ట్రక్ టైర్లు ఒక్కసారిగా పేలిపోయి అదుపు తప్పింది. ఇదే సమయంలో ఎదురుగా వస్తున్న స్పార్పియో వాహనంపైకి దూసుకెళ్లింది. బుధవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో స్పార్పియో డ్రైవర్ సహా ఎనిమిది చనిపోయినట్టు పేర్కొన్నారు. లారీ బలంగా ఢీకొట్టడంతో ఘటనా స్థలిలోనే ఏడుగురు మృతిచెందగా.. తీవ్రంగా గాయపడిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. సామర్ధ్యానికి మించి ఇసుకను లోడ్ చేయడంతోనే లారీ టైర్లు పేలిపోయినట్టు కౌశాంబి డిప్యూటీ కలెక్టర్ తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని తెలిపారు. దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. పోస్ట్‌మార్టం అనంతరం బంధువులకు అందజేస్తామని తెలిపారు. ఘటనా స్థలంలో బాధితుల బంధువుల ఆర్తనాదాలు మిన్నంటాయి.


By December 02, 2020 at 11:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/eight-people-killed-after-overloaded-truck-toppled-over-and-fell-on-car-in-up/articleshow/79524905.cms

No comments