కరోనాతో కన్నుమూసిన బీజేపీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది అభయ్ భరద్వాజ్
కరోనా వైరస్‌తో బీజేపీకి చెందిన మరో నేత కన్నుమూశారు. కోవిడ్-19 బారినపడ్డ రాజ్యసభ సభ్యుడు, గుజరాత్‌కు చెందిన బీజేపీ నేత (66) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భరద్వాజ్.. మంగళవారం రాత్రి చనిపోయారు. భరద్వాజ్ మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. దేశం తెలివైన మరో వ్యక్తిని పోగొట్టుకుందని అన్నారు. ‘గుజరాత్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు అభయ్ భరద్వాజ్ గొప్ప న్యాయవాది.. సమాజం కోసం ఆయన ఎంతో సేవ చేశారు.. జాతీయ అభివృద్ధి పట్ల మక్కువ ఉన్న గొప్ప దార్శినికుడు, తెలివైన వ్యక్తిని కోల్పోవడం విచారకరం.. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నాను.. ఓ శాంతి’ అని ట్వీట్ చేశారు. ఎంపీ భరద్వాజ్ మరణంపై గుజరాత్ సీఎం విజయ్ రూపానీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఓ జాతీయవాది.. న్యాయకోవిదుడు.. ప్రజా సేవకు నిరంతరం కట్టుబడి ఉన్నారని కొనియాడారు. గొప్ప న్యాయవాదిగా గుర్తింపు పొందిన అభయ్ భరద్వాజ్.. గతేడాది రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆగస్టులో జరిగిన బీజేపీ పార్టీ సమావేశాలు, రాజ్‌కోట్ రోడ్ షోకి హాజరైన భరద్వాజ్‌కు అప్పుడే నిర్ధారణ అయ్యింది. దీంతో చికిత్స కోసం తొలుత రాజ్‌కోట్‌లోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారు. కోవిడ్-19 తీవ్రత వల్ల భరద్వాజ్ ఊపిరితిత్తులు దెబ్బతినడంతో కృత్రిమ వ్వవస్థ ద్వారా ఆక్సిజన్ అందజేశారు. ఎక్స్‌ట్రాపోరియల్ మెంబ్రేన్ ఆక్సిజనేషన్ థెరపీ ఊపిరితీసుకునే అవకాశం ఉంటుందన్న వైద్య నిపుణుల సూచనలతో ఆయనను చెన్నైకు తరలించారు. అప్పటి నుంచి చెన్నైలో చికిత్స అందజేస్తున్నా ఆయన ఆరోగ్యంలో ఎటువంటి పురోగతి కనిపించలేదు.
By December 02, 2020 at 12:13PM
No comments