తొలి సినిమానే చిత్రకు లాస్ట్ మూవీ.. రిలీజ్‌కు సిద్ధమైన ‘కాల్స్’
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న నటి వి.జె.చిత్ర తొలి సినిమా ‘’ విడుదలకు సిద్ధమైంది. బుల్లితెరపై ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న చిత్ర ఎన్నో ఆశలతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అయితే దురదృష్టవశాత్తూ చిత్ర నటించిన తొలి చిత్రమే ఆమె ఆఖరి చిత్రంగా మారింది. ఇన్‌ఫైనైట్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.జయకుమార్, జే. కావేరి సెల్వి నిర్మాణంలో 2019 జూలైలో ‘కాల్స్’ చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. జె.శబరీష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ చెన్నై, తంజావూరు, తిరుచ్చి, వారణాసి తదితర ప్రాంతాల్లో జరిగింది.
ఢిల్లీ గణేష్, నిళల్‌గళ్ రవి, ఆర్.సుందరరాజన్, దేవదర్శిని, వినోదిని, వైద్యనాధన్, జీవా రవి, శ్రీరంజని తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ జనవరిలోనే పూర్తి కావడంతో అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని జులై నెలలో విడుదల చేయాలనుకున్నారు. అయితే లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమా వాయిదా పడింది. జనవరిలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో చిత్ర ఆత్మహత్య చేసుకోవడం అందరినీ షాక్‌కు గురిచేసింది. ఆదివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్ విడుదల చేయగా.. జనవరి 1న ట్రైలర్ విడుదల చేయనున్నట్లు ‘కాల్స్’ డైరెక్టర్ శబరీష్ తెలిపారు. By December 16, 2020 at 10:38AM
No comments