Breaking News

జపనీయులు రజినీకాంత్‌ని ఆరాధించడం వెనుక ఇంత కథ ఉందా..!


సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ను జపనీయులు ఎంతగా ఇష్టపడతారో మనకి తెలిసిందే. ‘ముత్తు’ సినిమాతో ఆ దేశస్థులకు రజినీ ఆరాధ్య నటుడయ్యారు. అక్కడ పిల్లల నుంచి పెద్దల వరకు ఆయనంటే పిచ్చి అభిమానం. పాటలకు రజనీ వేసే స్టెప్పులు, ఆయన మేనరిజం, స్టైల్ అంటే విపరీతమైన ఇష్టం. పరాయి దేశంలో మరే భారతీయ నటుడికి లేనంత అభిమానాన్ని సొంతం చేసుకున్నారాయన. అయితే రజినీకాంత్‌ గురించి అక్కడి వారికి ఎలా తెలిసింది.. అంతలా ఆరాధించడానికి రజినీలో వారికి ఏం నచ్చింది.. అన్న అంశాల వెనుక ఓ ఆసక్తికరమైన స్టోరీ ఉంది. Also Read: జూన్‌ ఎడోకి అనే జపాన్‌ సినీ విమర్శకుడు ఓసారి సింగపూర్‌‌కి వెళ్లాడు. అక్కడ ‘లిటిల్‌ ఇండియా’ మార్కెట్లో షాపింగ్‌ చేస్తూ మంచి భారతీయ సినిమా కావాలని ఓ షాపు యజమానిని అడిగాడు. దీంతో అతడు ‘ముత్తు’ సినిమా సీడీని ఎడోకి ఇచ్చాడు. ఆ సినిమా జూన్ ఎడోకి తెగ నచ్చేయడంతో తన భార్యకి చూపించాడు. ఆమెకు కూడా నచ్చడంతో బంధువులు, స్నేహితులకు ఆ సినిమా గురించి చెప్పడం మొదలుపెట్టింది. అలా ఈ విషయం స్ఠానికంగా బాగా ప్రచారం జరగడంతో ‘ముత్తు’ సినిమా సంగతి ఇచ్చికవ, జనడియక్స్‌ అనే మల్టీప్లెక్స్ సంస్థల దృష్టికి వెళ్లింది. దీంతో వారు ముత్తు సినిమా హక్కులు తీసుకుని అక్కడి థియేటర్లలో రిలీజ్ చేశారు. స్టైల్‌కి అక్కడి వారు ఫిదా అయిపోవడంతో హాళ్లన్నీ హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దుమ్మురేపాయి. దీంతో రజినీకి అక్కడి భారీ ఫాలోయింగ్ ఏర్పడింది. అప్పటి నుంచి డిస్ట్రిబ్యూటర్లు‌ రజినీ నటించిన అన్ని సినిమాలను ఇండియాతో సమానంగా జపాన్‌లోనూ రిలీజ్ చేస్తున్నారు. అలా మన సూపర్‌స్టార్ జపనీయులకు కూడా ఆరాధ్య నటుడిగా మారిపోయారు.


By December 18, 2020 at 11:04AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/story-behind-the-japanese-adoring-to-super-star-rajinikanth/articleshow/79784122.cms

No comments