Breaking News

నిహారిక నాకు అమ్మలాంటిది.. ఆ క్రెడిట్ మొత్తం వరుణ్‌దే: సాయిధరమ్ తేజ్


మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు సాయిధరమ్‌తేజ్. అయితే కేవలం బ్యాక్‌గ్రౌండ్‌నే నమ్ముకోకుండా తనదైన టాలెంట్‌తో అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. వరుస ఫ్లాపులతో ఢీలా పడిన సమయంలో ‘ప్రతిరోజూ పండగే’తో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి మళ్లీ స్పీడ్ అందుకున్నాడు. ఆయన నటించిన తాజా సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’.. డిసెంబర్ 25వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది. థియేటర్లు పునః ప్రారంభమయ్యాక ప్రేక్షకుల ముందుకొస్తున్న పెద్ద సినిమా ఇదే కావడంతో ఇప్పుడు ఇండస్ట్రీ ఫోకస్ మొత్తం ఈ మెగా మేనల్లుడిపైనే ఉంది. ఈ నేపథ్యంలో తన సినీ కెరీర్‌తో పాటు వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు మీడియాతో పంచుకున్నారాయన. తానేమీ అసాధారణమైన పనులు చేయడం లేదని... అన్ని సినిమాలూ ఓటీటీలో చూసేవి కావు కాబట్టే తమ సినిమాను ధైర్యం చేసి థియేటర్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఒక జోక్‌ వచ్చినప్పుడు నలుగురితో కలిసి నవ్వితే ఆ ఆనందం వేరని, థియేటర్‌ అనుభూతి చాలా ప్రత్యేకమైనదని తెలిపారు. ఆ అనుభూతిని పునః సృష్టించి జోష్‌ నింపడం కోసం కష్టపడుతున్నామన్నారు. తాను ప్రస్తుతం దేవా కట్టాతో ఓ సినిమా చేస్తున్నానని, 60శాతం షూటింగ్ పూర్తి కావొచ్చిందని తేజ్ తెలిపారు. ఇందులో యువ ఐఏఎస్‌ అధికారిగా కనిపిస్తానన్నారు. దీంతో పాటు సుకుమార్‌ రైటింగ్స్‌, బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ కలిసి నిర్మిస్తున్న ఓ సినిమాలో నటించనున్నట్లు వెల్లడించారు. 1970, 80 నేపథ్యంలో కథ నేపథ్యంలో ఆ సినిమా తెరకెక్కనుందని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయన్నారు. మా అమ్మ.. మా ఇంట్లో కజిన్స్‌ అంతా అన్నా చెల్లెళ్లులాగే పెరిగాం. చిన్నప్పట్నుంచీ నిహారికను చెల్లెలిగానే ఫీల్‌ అవుతుంటాను. శ్రీజ, సుస్మితతోనూ మా అందరిదీ అక్కాతమ్ముళ్ల బంధమే. నిహారికకి చాలా వరకు మా అమ్మ పోలికలు ఉంటాయంటారు. అంతా మేనత్త పోలికే అని మాట్లాడుతుంటారు. అందుకే నిహారిక మా అమ్మలాగే చూసుకుంటాను. నిహారిక ఎప్పుడూ హుషారుగా ఉంటుంది. ఎవరింటికి వెళ్లినా సందడి చేస్తుంటుంది. నిహారిక పెళ్లి విషయంలో క్రెడిట్ మొత్తం వరుణ్‌ తేజ్‌కే ఇవ్వాలి. పెళ్లి పనులు మొత్తం అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. పండగలు, వేడుకల్లో కుటుంబ సభ్యులందరం కలుస్తుంటాం. అయినప్పటికీ ఎప్పుడూ ఎవరో ఒకరు మిస్ అవుతుంటారు. వంద శాతం కలిసేది ఇలాంటి సందర్భాల్లోనే. అందుకే నిహారిక పెళ్లి మొత్తం మా కుటుంబానికే పండగ తెచ్చింది. నాకు పెళ్లిపై అంత ఆసక్తి లేదు. కానీ మా అమ్మ సంతోషం కోసం పెళ్లి చేసుకుంటానని చెప్పాను. అమ్మ ఎప్పుడూ అదే విషయం గురించి మాట్లాడుతుంటే తట్టుకోలేక మంచి అమ్మాయిని చూడమని చెప్పేశా. ప్రస్తుతం సోలో లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేస్తున్నా’ అని చెప్పుకొచ్చారు సాయిధరమ్ తేజ్.


By December 16, 2020 at 08:20AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-dharam-tej-express-his-feeling-abount-niharika/articleshow/79750742.cms

No comments