సాయుధ దళాల పతాక దినోత్సవం.. సైనికుల దేశభక్తి జోహార్లు
ఏటా డిసెంబరు 7న నిర్వహించుకుంటాం. దేశ రక్షణ కోసం సాయుధ దళాలు అహర్నిశలు చేస్తున్న కృషి, శత్రువుల నుంచి దేశాన్ని రక్షిస్తూ వారు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాలకు అండగా ఉన్నామని తెలియజేయడమే దీని ప్రత్యేకత. 1949లో రక్షణ మంత్రి కమిటీ పతాక దినోత్సవం డిసెంబరు 7న జరుపుకోవాలని నిర్ణయించారు. దేశ రక్షణతోపాటు అంతర్గతంగా జరిగే అనేక విపత్కర పరిస్థితులను చక్కదిద్దడంలో ఆర్మీ, వైమానిక, నౌకా దళం కీలక పాత్ర పోషిస్తుంటాయి. ప్రజల ధన, మాన ప్రాణాలను రక్షించడంలో సాయుధ ధళాలు ముందువరసలో ఉంటాయి. రాష్ట్రాలలో సంభవించిన వరదలు, భూకంపాల సమయంలో వేలాది మందిని తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సురక్షిత ప్రాంతాలకు సైనికులు చేర్చతుంటారు. పలుచోట్ల జరిగిన ఉగ్రవాద కార్యకలాపాలను అరికట్టి ప్రజలను రక్షిస్తూ వీరమరణం పొందిన విషయం కూడా మనందరికీ తెలుసు. త్రివిధ దళాల ప్రాతినిధ్యం వహించే ఎరుపు, ముదరు నీలం, లేత నీలం రంగుల జెండాలను కేంద్రీయ సైనిక్ బోర్డు, రాజ్యసభ, జిల్లా సైనిక్ బోర్డ్ ద్వారా ప్రజలకు పంపిణీ చేసి విరాళాలు సేకరిస్తారు. దేశం కోసం పోరాడే సైనికుల కుటుంబాలు, వారిపై ఆధారపడి జీవించేవారి పరిరక్షణ గురించి పట్టించుకోవాల్సిన బాధ్యత సాధారణ ప్రజకు ఉందనే ఉద్దేశంతో విరాళాలు సేకరించడం ఫ్లాగ్ డేకు అత్యధిక ప్రాధాన్యత లభించింది. యుద్ధంలో గాయపడినవారికి పునరావాసం కల్పించడం, సర్వీసులో సిబ్బంది, వారి కుటుంబీకుల సంక్షేమం, మాజీ సైనికోద్యోగులు, వారి కుటుంబాల సంక్షేమం, పునరావసం కల్పించడం. అమరవీరుల కుటుంబాలు, మాజీ సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా సైనిక సంక్షేమ శాఖ స్థాపించారు. ఈ శాఖ రాష్ట్రంలో హోం శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందించే అన్ని రాయితీలను వారికి సక్రమంగా చేర్చడానికి ఈ శాఖ ప్రత్యేకంగా కృషిచేస్తుంది. భారత సైనిక భద్రతా దళాల్లో భారత సైనికదళం, భారత నౌకాదళం, భారత వైమానికదళం ఉన్నాయి. 14 లక్షలకు పైబడిన సైన్యంతో ప్రపంచంలోని మూడో అతి పెద్ద సైన్యం కలిగిన దేశంగా భారత్ గుర్తింపు పొందింది. భారత రక్షణ దళాలలన్నింటికి సర్వసైన్యాధక్షుడుగా భారత రాష్ట్రపతి వ్యవహరిస్తారు. ప్రధానమైన ఈ మూడు రక్షణ దళాలతోపాటు తీర రక్షక దళం, పారామిలటరీ దళాలు కూడా వీటిలో అంతర్‌భాగాలే. భారత సాయుధ దళాలు అనేక సైనిక చర్యల్లో 1947, 1965, 1971 సంవత్సరాల్లో పాల్గొన్నాయి. అందులో 1963లో చైనా యుద్ధం, పోర్చుగీసు యుద్ధం, 1987లో చైనా ఘర్షణ, కార్గిల్ యుద్ధం, సీయాచిన్ ఘర్షణలో పాల్గొన్నాయి. 2014లో ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకున్న దేశాలలో భారతదేశం అగ్రస్థానంలో నిలిచింది.
By December 07, 2020 at 10:00AM
No comments