Breaking News

స్మార్ట్‌ఫోన్ కొనే స్తోమత లేక.. విద్యార్థిని ఆత్మహత్య


ఆన్‌లైన్ తరగతులు వినేందుకు స్మార్ట్‌ఫోన్ కొనే స్తోమత లేకపోవడం ఓ విద్యార్థిని ప్రాణాలు తీసింది. తండ్రి స్మార్ట్‌ఫోన్ కొనివ్వలేదన్న మనస్థాపంతో కూతురు ఆత్మహత్య చేసుకుంది. ఈ అత్యంత విషాద ఘటన పెద్దపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. మండలం న్యూ పోరట్‌పల్లికి చెందిన కోకా రమేష్, పల్లవి దంపతులకు ఇద్దరు కూతుళ్లు. పెద్దకూతురికి పెళ్లి చేసి పంపించారు. రెండో కూతురు రోజా(18) సిద్దిపేట జిల్లా పెద్దకోడూరు ప్రభుత్వ బాలికల పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఫైనలియర్ చదువుతోంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఇంటికే పరిమితమైన రోజా ఆన్‌లైన్ క్లాసులు వినేందుకు స్మార్ట్‌ఫోన్ కావాలని తండ్రిని అడిగింది. ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్‌లో ట్రక్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రమేష్‌‌కి డబ్బు సర్దుబాటు కాకపోవడంతో స్మార్ట్‌ఫోన్ కొనిచ్చే స్తోమత లేదని.. సర్దుకొమ్మని కూతురికి నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన రోజా అఘాయిత్యానికి ఒడిగట్టింది. తల్లిదండ్రులు గురువారం ఉదయం సమీపంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లిన సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకుంది. బంధువుల ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు కూతురు ఎంతసేపటికీ రాకపోవడంతో అనుమానం వచ్చి ఇంటికి వచ్చి చూడగా ఉరికి వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను కిందకు దించి ఆస్పత్రికి తీసుకెళ్తుండగా ప్రాణాలు కోల్పోయింది. నా చావుకు ఎవరూ కారణం కాదు.. నేను కారణం అని రాసి ఉంచిన సూసైడ్ నోట్ లభ్యమైంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. Also Read:


By December 25, 2020 at 02:02PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/18-year-old-girl-kills-self-over-smartphone-in-karimnagar/articleshow/79953312.cms

No comments