Breaking News

ప్రభాస్ ‘సలార్’ కంటే ముందే... ‘భగీర’ను సిద్ధం చేస్తున్న కేజీఎఫ్ డైరెక్టర్


ఒకే ఒక్క సినిమాతో తన రేంజ్‌ని ఎన్నో రెట్లు పెంచుకున్నాడు దర్శకుడు . యష్‌ను హీరోగా పెట్టి ఆయన తెరకెక్కించిన ‘కేజీఎఫ్’ సినిమా ఎన్నో రికార్డులు సృష్టించింది. 2018లో విడుదలైన ఈ సినిమా యష్‌ను నేషనల్ స్టార్‌ని చేసేసింది. అతడి మార్కెట్‌ ఏకంగా రూ.200కోట్లకు చేరిపోయింది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న ‘కేజీఎఫ్ 2’పై కూడా భారీ అంచనాలున్నాయి. మరోవైపు ప్రశాంత్ నీల్‌తో సినిమా చేసేందుకు దక్షిణాదితో పాటు బాలీవుడ్‌ హీరోలు సైతం పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభాస్‌తో ‘సలార్’ టైటిల్‌తో ఓ సినిమా ప్రకటించాడు ప్రశాంత్ నీల్. అయితే సలార్ కోసం కథ, స్క్రీన్ ప్లే రాసుకుంటూనే ‘భగీరా’ టైటిల్‌తో మరో కథను సిద్ధం చేసుకున్నాడట ప్రశాంత్. తన బావమరిది శ్రీమురళి హీరోగా ఈ సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీమురళి పుట్టినరోజు సందర్భంగా గురువారం ‘’ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు. ‘సమాజం ఎప్పుడైతే దారి తప్పుతుందో.. దాన్ని కాపాడటానికి, అదుపులో పెట్టడానికి ఒకడొస్తాడు’ అంటూ పవర్‌ఫుల్ పోలీస్ స్టోరీ తెరకెక్కిస్తున్నాడు. ప్రభాస్ ‘సలార్’ కంటే ముందే ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కేజీఎఫ్‌ కంటే ముందు శ్రీ మురళిని హీరోగా పెట్టి ‘ఉగ్రం’ అనే సినిమా తీశాడు ప్రశాంత్ నీల్. ఊహించని రీతిలో ఈ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. ఆ ఊపులోనే ఏకంగా రెండేళ్లు కష్టపడి కేజీఎఫ్ కథ సిద్ధం చేసుకున్నాడు. ఆ సినిమా అతడిని ఏకంగా స్టార్ డైరెక్టర్‌ని చేసేసింది. ఇప్పుడు పోస్టర్‌పై ప్రశాంత్ నీల్ పేరు కనిపిస్తేనే చాలు బొమ్మ హిట్టు అన్నట్లుగా కొనసాగుతోంది అతడి హవా.


By December 18, 2020 at 09:07AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kgf-director-prashanth-neel-announce-new-film-bagheera-with-sriimurali/articleshow/79789564.cms

No comments