Breaking News

సుడిగాలి సుధీర్‌తో రిలేషన్‌పై విష్ణుప్రియ రియాక్షన్‌.. నా రొమాన్స్ చూసి ఫీలయ్యాడంటూ బోల్డ్ కామెంట్స్


ఈ మధ్యకాలంలో వెండితెర నటులకంటే బుల్లితెర నటులకే మంచి డిమాండ్ ఉంటోంది. బుల్లితెర యాంకర్స్, కమెడియన్స్ ప్రేక్షకుల నుంచి భారీ ఆదరణ పొందుతుండటం చూస్తున్నాం. ముఖ్యంగా వారి వారి వ్యక్తిగత విషయాలు, కుటుంబ సంగతులు తెలుసుకునేందుకు జనం ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో సుడిగాలి సుధీర్‌తో లవ్ ట్రాక్ విషయమై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది యంగ్ యాంకర్ . బుల్లితెరపై 'పోవే పోరా' షోతో భారీ రెస్పాన్స్ తెచ్చుకున్న విష్ణుప్రియ.. సుడిగాలి సుధీర్‌తో కలిసి చాలా ప్రోగ్రామ్స్ హోస్ట్ చేసింది. సుధీర్‌ని ఆటపట్టిస్తూ పోటాపోటీగా టాలెంట్ చూపించింది. దీంతో ఈ ఇద్దరి కెమిస్ట్రీ చూసి సుడిగాలి సుధీర్‌తో విష్ణుప్రియ లవ్ ట్రాక్ నడిపిస్తోందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఇన్నిరోజులు వీటిని పెద్దగా పట్టించుకోని ఆమె.. తాజాగా తన లేటెస్ట్ మూవీ 'చెక్‌మేట్' ప్రమోషన్స్‌లో భాగంగా ఓపెన్ అయింది. తామిద్దరం లవర్స్ కాదని, కేవలం ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పి తమ రిలేషన్‌పై వస్తున్న రూమర్లకు ఫుల్‌స్టాప్ పెట్టేసింది. Also Read: ఇకపోతే సుధీర్ గురించి మరికొన్ని విషయాలు చెప్పిన విష్ణుప్రియ.. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత క్లోజ్ అయిన మొదటి పర్సన్ అతనే అనే, తాను సంతోషంగా ఉన్నా.. బాధలో ఉన్నా మొదట కాల్ చేసేది సుధీర్‌కే అని చెప్పుకొచ్చింది. తన లేటెస్ట్ మూవీ 'చెక్‌మేట్'లో సుధీర్ కూడా నటించాడని తెలిపింది. ఈ క్రమంలోనే.. ఇందులో మీ రొమాంటిక్ సీన్స్ సుధీర్ చూశాడా? అనే ప్రశ్నపై షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది విష్ణుప్రియ. ''ఇటీవల విడుదలైన ట్రైలర్‌లో నా రొమాన్స్ చూసి బాగా ఫీలయ్యాడు పాపం. పర్సనల్ మ్యాటర్ కదా! ఇంతకు మించి ఇంకా చెప్పలేను'' అని బదులిచ్చి ఆసక్తి రేకెత్తించింది. అతిత్వరలో ఈ 'చెక్‌మేట్' మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.


By December 04, 2020 at 12:12PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anchor-vishnu-priya-open-comments-on-relationship-with-sudigali-sudheer/articleshow/79561394.cms

No comments