Breaking News

దేశంలో మరో ఐదుగురికి యూకే కరోనా స్ట్రెయిన్.. 25కి చేరిన కొత్తరకం కేసులు


దేశంలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. మరో ఐదుగురిలో యూకే స్ట్రెయిన్ నిర్ధారణ అయినట్టు కేంద్రం ఆరోగ్య శాఖ గురువారం ప్రకటించింది. దీంతో దేశంలో కొత్తరకం కరోనా స్ట్రెయిన్ కేసుల సంఖ్య 25కు చేరింది. పుణేలోని నేషనల్ వైరాలజీ ఇన్‌స్టిట్యూట్‌ ల్యాబ్‌లో నాలుగు, ఢిల్లీలోని ఐజీఐబీ ల్యాబ్‌లో ఒక కేసు నిర్ధారణ అయినట్టు తెలిపింది. అయితే, ఈ ఐదుగురు ఏ రాష్ట్రానికి చెందినవారు అనే వివరాలను మాత్రం తెలియజేయలేదు. మంగళవారం తొలిసారిగా ఆరు కేసులు, బుధవారం 14 కేసులు నమోదయిన విషయం తెలిసిందే. అలాగే, దేశంలో బారినపడి ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 96 లక్షలకు మించిందని.. రికవరీ రేటు 96 శాతంగా నమోదయ్యిందని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు కొత్తగా మరో 21,994 మందికి వైరస్ నిర్ధారణ అయ్యింది. అత్యధికంగా కేరళలో 6,268 మంది కొత్తగా వైరస్ బారినపడ్డారు. ఆ తర్వాత మహారాష్ట్ర, పశ్చిమ్ బెంగాల్, ఉత్తర్ ప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయి. అలాగే, కరోనాతో మరో 299 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మొత్తం 102,67,283 మంది కరోనా వైరస్ బారినపడగా.. 98,59,762 మంది కోలుకున్నారు. అలాగే, 148,774 మంది ప్రాణాలు కోల్పోగా.. 255,898 యాక్టివ్ కేసులు ఉన్నాయి.


By December 31, 2020 at 11:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/five-new-cases-of-new-covid-strain-in-india-total-25-cases-so-far/articleshow/80041020.cms

No comments